Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Ireland తొలి టీ20.. అరుదైన దృశ్యం!

డబ్లిన్: భారత్-ఐర్లాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఏకంగా ఐదుగురు లెఫ్టాండర్స్ బరిలోకి దిగారు. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లు లెఫ్టాండర్ బ్యాటర్లు కావడం విశేషం. రింకూ సింగ్ ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా ప్రధాన జట్టు ఈ పర్యటనకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా తృతీయ శ్రేణి జట్టును ఈ పర్యటనకు ఎంపిక చేశారు. ప్రధాన జట్టు టాప్-5 బ్యాటర్లలో ఒక్క లెఫ్టాండర్ లేకపోవడం టీమిండియాకు తీవ్ర నష్టం చేస్తోంది. దాంతోనే తిలక్ వర్మను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

 India vs Ireland

ఇక తృతీయ శ్రేణి జట్టు అయినా టీమిండియా దుమ్మురేపింది. ఆతిథ్య జట్టును తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. జస్‌ప్రీత్ బుమ్రా(2/24), ప్రసిధ్ కృష్ణ(2/32), రవి బిష్ణోయ్(2/23) రెండేసి వికెట్లతో సత్తా చాటడంతో ఐర్లాండ్ 140 పరుగుల లక్ష్యాన్నే నమోదు చేసింది. టెయిలెండర్ బారీ మెక్‌కార్తీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది.

అతనికి తోడుగా కర్టీస్ కాంఫెర్(39) రాణించాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), రుతురాజ్ గైక్వాడ్ శుభారంభం అందించారు. దాంతో పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా భారత్ 45 పరుగులు చేసింది. ఆ వెంటనే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. వరుస బంతుల్లో యశస్వి జైస్వాల్(24), తిలక్ వర్మ(0)ను వెనుదిరిగారు.

ఇద్దరూ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరారు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన తిలక్ వర్మ.. గోల్డెన్ డక్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్(1 బ్యాటింగ్)తో రుతురాజ్ గైక్వాడ్(19 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.

Story first published: Friday, August 18, 2023, 22:18 [IST]
Other articles published on Aug 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+