For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టెస్ట్ ముందు ఇంగ్లండ్‌కు షాక్! ఫ్లోర్‌పై జారిపడిన స్టార్ ఓపెనర్.. రెండు టెస్టులకు దూరం!

India vs England: Zak Crawley ruled out of the first two tests with wrist injury

చెన్నై: టీమిండియాతో శుక్రవారం నుంచి చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. మణికట్టు గాయంతో స్టార్ ఓపెనర్ జాక్ క్రాలే తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. బుధవారం ప్రాక్టీస్ చేసేందుకు మైదానంలోకి వెళుతున్న సమయంలో.. డ్రెస్సింగ్ రూమ్ వెలుపల ఫ్లోర్‌పై జారిపడడంతో 23 ఏళ్ల క్రాలే కుడి చేతికి గాయమైందని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఫ్లోర్‌పై జారిపడిన జాక్ క్రాలే

ఫ్లోర్‌పై జారిపడిన జాక్ క్రాలే

'జాక్ క్రాలే బుధవారం డ్రెస్సింగ్ రూమ్ వెలుపల ఫ్లోర్‌పై జారిపడ్డాడు. దాంతో అతడి కుడి చేతికి గాయమైంది. గత రాత్రి స్కాన్ ఫలితాలు వచ్చాయి. అతని కుడిచేయి మణికట్టు బెణికిందని తేలింది. గాయం తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది. టీమిండియాతో చెన్నైలో జరిగే తొలి రెండు టెస్టులకు క్రాలే దూరమయ్యాడు. ఇంగ్లండ్ వైద్య బృందం అతని గాయంను పరీక్షిస్తోంది. మిగతా రెండు టెస్టులకు అందుబాటులో ఉండే విషయం తర్వాత నిర్ణయం తీసుకుంటాం' అని ఈసీబీ తెలిపింది.

విచిత్రమైన ప్రమాదం

విచిత్రమైన ప్రమాదం

జాక్ క్రాలే గాయం నిజంగా నిరాశపరిచిందని ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ అన్నాడు. ఇది ఓ విచిత్ర ప్రమాదమని, ఇదే చివరిదని ఆశిస్తున్నా అని రూట్ పేర్కొన్నాడు. ఓపెనర్ క్రాలీ 10 టెస్ట్ మ్యాచ్‌లలో 616 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 267 పరుగులు గతేడాది ఆగష్టులో పాకిస్తాన్‌పై చేశాడు. ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనలో పేలవమైన ఆటతో నిరాశపరిచాడు. 9, 8, 5, 13 స్కోర్ చేశాడు. క్రాలే స్థానంను ఎవరు భర్తీ చేస్తారో రూట్ చెప్పలేదు.

జట్టులోకి ఒలీ పోప్

జట్టులోకి ఒలీ పోప్

తొలి టెస్టు ఆరంభానికి రెండు రోజుల ముందు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఒలీ పోప్‌ను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) జట్టులో చేర్చింది. గతేడాది ఆగస్టులో పాకిస్థాన్‌తో సిరీస్‌ సందర్భంగా భుజం గాయానికి గురైన 23 ఏళ్ల పోప్‌.. పూర్తిగా కోలుకున్నాడని ఈసీబీ పేర్కొంది. తొలి టెస్టు తుది జట్టులో పోప్‌కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోప్‌ ఇంగ్లండ్ తరఫున 13 టెస్టులు ఆడి 645 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 135.

ఆర్చర్‌తో జాగ్రత్త

ఆర్చర్‌తో జాగ్రత్త

జోఫ్రా ఆర్చర్‌ తన అస్త్ర శస్త్రాలతో టీమిండియా పని పట్టేందుకు సిద్ధమవుతున్నాడని, భారత ఆటగాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ జో రూట్‌ హెచ్చరించాడు. ప్రాక్టీస్‌ సమయంలో ఆర్చర్‌ వేసే బంతులు మంచి రిథమ్‌తో బులెట్‌ కంటే వేగంగా వస్తున్నాయని, అతడిని ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్‌మెన్లకు ఇబ్బంది పడడం ఖాయమని పేర్కొన్నాడు. ఆర్చర్‌ భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. ఐపీఎల్‌ 13వ సీజన్‌ తర్వాత లంకతో జరిగిన సిరీస్‌కు ఆర్చర్‌ దూరంగా ఉన్నాడు. గత సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడిన ఆర్చర్‌.. 14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లతో మంచి ప్రదర్శన చేశాడు.

T10 League: క్రిస్ గేల్ విధ్వంసం..12 బంతుల్లో హాఫ్ సెంచరీ! 22 బంతుల్లోనే!

Story first published: Thursday, February 4, 2021, 16:24 [IST]
Other articles published on Feb 4, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+