Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: జస్‌ప్రీత్ బుమ్రా రికార్డ్‌ బ్రేక్ చేసిన చాహల్‌

India vs England: Yuzvendra Chahal surpasses Jasprit Bumrah, becomes Indias leading wicket-taker in T20I

అహ్మదాబాద్‌: టీమిండియా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో పేస్ గుర్రం, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్‌ బుమ్రా రికార్డును అధిగమించాడు. ఇంగ్లండ్‌తో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో చాహల్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (28)ను ఔట్ చేయడంతో ద్వారా.. పొట్టి ఫార్మాట్‌లో 60వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో జస్‌ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న 59 వికెట్ల(50 మ్యాచ్‌ల్లో) రికార్డును వెనక్కి నెట్టాడు.

చాహల్‌ ఈ ఘనతను కేవలం 46వ మ్యాచ్‌లోనే అందుకోవడం విశేషం. ఓవరాల్‌గా చాహల్‌కు ఇది భారత్‌ తరఫున 100వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం గమనార్హం. 2016లో జింబాబ్వేతో జరిగిన వన్డే ద్వారా చాహల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 54 వన్డేల్లో ఈ హర్యానా స్పిన్నర్ 92 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ వైఫల్యంతో ఈ ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ శుభారంభం చేయలేకపోయింది. 8 వికెట్ల తేడాతో పరాజయంపాలై 0-1తో వెనుకంజలో నిలిచింది. ఆదివారం ఇదే మైదానం వేదికగా జరిగే సెకండ్ టీ20లో గెలిచి సిరీస్‌పై పట్టు సాధించాలని భావిస్తోంది.

Story first published: Saturday, March 13, 2021, 19:22 [IST]
Other articles published on Mar 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+