
చాహల్‌కు ఏమైంది.?
అలాంటిది కొన్ని రోజులుగా చాహల్ దారుణంగా విఫలమవుతున్నాడు. మునుపటి స్థాయిలో వికెట్లు తీయడం లేదు. దారళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లోనూ చాహల్ ప్రదర్శన మరీ పేలవంగా ఉంది. తొలి టీ20లో 44, రెండో టీ20లో 34, మూడో టీ20లో 41 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచుకు ఒకటి చొప్పున 3 వికెట్లే తీశాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించడంలో విఫలమయ్యాడు. అతని బంతుల్ని వారు అలవోకగా ఆడేస్తున్నారు. సునాయాసంగా బౌండరీలకు తరలిస్తున్నారు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్నారు.

12 టీ20ల్లో 10 వికెట్లే..
చివరి 15 నెలల్లో 12 టీ20లు ఆడిన చాహల్ కేవలం 10 వికెట్లే తీయగలిగాడు. ఎకానమీ రేటు పైపైకి చేరుకుంటోంది. 2020, జనవరికి ముందు 36 టీ20ల్లో 21.9 సగటు, 8.1 ఎకానమీతో అతను 52 వికెట్లు తీశాడు. 2020, జనవరి నుంచి 11 మ్యాచులాడి 43.88 సగటు, 9.3 ఎకానమీతో 9 వికెట్లే మాత్రమే పడగొట్టాడు. వన్డేల్లోనూ ఇదే పరిస్థితి. 2020కి ముందు 85 మ్యాచుల్లో 26.42 సగటు, 5.06 ఎకానమీతో 50 వికెట్లు పడగొట్టిన చాహల్.. 2020, జనవరి నుంచి 4 మ్యాచులాడి 37.85 సగటు, 6.79 ఎకానమీతో 7 వికెట్లే తీశాడు.

ఫీల్డింగ్‌లోనూ..
మ్యాచ్‌కు తగ్గట్టు సరైన లైన్, లెంగ్త్‌ను ఎంచుకోవడంలోనూ చాహల్ ఇబ్బంది పడుతున్నాడు. ఫీల్డింగ్‌లోనూ తడబడుతున్నాడు. సునాయస క్యాచ్‌లను నేలపాలు చేస్తున్నాడు. అందుకే అతని స్థానంలో మరొకరికి చోటు ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎకానమీ, సగటు పడిపోతున్నా అతన్నెందుకు కొనసాగిస్తున్నారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బహుశా తర్వాతి మ్యాచుల్లో అతని బదులు అక్షర్ పటేల్‌ను ఆడించే అవకాశం ఉంది. పెళ్లయిన తర్వాత జోష్‌గా రాణిస్తాడనుకున్న చాహల్.. గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు.


Click it and Unblock the Notifications
