India vs England: బెన్ స్టోక్స్ ఔటా.. నాటౌటా?! థర్డ్ అంపైర్ ఔటిచ్చి ఉంటే!!

పూణే: శుక్రవారం టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. స్టోక్స్ ధాటికి ఇంగ్లండ్ మరో 6.3 ఓవర్లు ఉండగానే 337 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. అయితే స్టోక్స్ 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రనౌట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో.. థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే స్టోక్స్ రనౌటా.. కాదా? అనేది సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది.
క్లారిటీ లేకపోవడంతో:
పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్ అయిదో బంతిని బెన్ స్టోక్స్ మిడాన్ దిశగా షాట్‌ను ఆడాడు. సింగిల్ పూర్తి చేసిన స్టోక్స్.. రెండో పరుగు కోసం ప్రయత్నించగా కుల్దీప్ యాదవ్ వేసిన త్రో నేరుగా వికెట్లను తాకింది. స్టోక్స్ బ్యాట్ క్రీజులో లేకపోవడంతో అంతా అవుటేనని భావించారు. అయితే రిప్లేలో చాలాసార్లు పరీక్షించిన థర్డ్ అంపైర్.. క్లారిటీ లేకపోవడంతో నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే స్టోక్స్ బ్యాట్ గీత దాటి లోపలికి రాకముందే బంతి వికెట్లను గిరాటేసిందని, అది ఔటేనని భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సహా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
పెను విధ్వంసం:
31 పరుగుల వద్ద ఔట్ నుంచి బయటపడిన బెన్ స్టోక్స్ ఆ తర్వాత పెను విధ్వంసం సృష్టించాడు. కుల్దీప్ ఓవర్లో 6, 4 బాదిన స్టోక్స్ 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత స్టోక్స్ కొట్టిన షాట్లు భారత్ గెలిచే అవకాశాలను పూర్తిగా దూరం చేశాయి. అర్ధ సెంచరీ తర్వాత 11 బంతుల్లో వరుసగా 6, 6, 6, 1, 6, 4, 2, 6, 6, 2, 4 (మొత్తం 49) పరుగులు చేశాడు. ముఖ్యంగా కుల్దీప్ ఓవర్లో కొట్టిన మూడు వరుస సిక్సర్లు, కృనాల్ ఓవర్లో కొట్టిన 3 సిక్స్ లు, 1 ఫోర్ మ్యాచును టీమిండియాకు దూరం చేసింది. ఒకవేళ స్టోక్స్‌ను అప్పుడే ఔట్‌గా ప్రకటించి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో.

ఇంగ్లండ్ ఘన విజయం:
టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 43.3 ఓవర్లలలో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) తృటిలో శతకం కోల్పోయాడు. జేసన్ రాయ్ (52 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం చేశాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసింది. కేఎల్ రాహుల్ (114 బంతుల్లో 108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు.
MCA cricket stadium: భారత్-ఇంగ్లండ్ రెండో వన్డే.. 35 మంది అరెస్ట్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications