
ఇక్కడ మసాల దొరకదు..
ఫస్ట్ టెస్ట్ ఓటమి అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. మైదానంలో తమ బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ ఉండాల్సిన స్థాయిలో లేదని, కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో తాము మెరుగ్గా రాణించామన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా సెకండాఫ్‌లో బ్యాట్‌తో పర్వాలేదనిపించామని తెలిపాడు. అయితే ఈ వ్యాఖ్యలనే రహానే ముందు ప్రస్తావించిన ఓ మీడియా ప్రతినిధి.. ఆటగాళ్ల శక్తి సామర్థ్యాలు తగ్గడానికి కెప్టెన్సీ మార్పే కారణమా? అని ప్రశ్నించాడు. అయితే మైదానంలో ఒకే విధమైన శక్తిని కలిగి ఉండటం ఎప్పుడూ సాధ్యం కాదని బదులిచ్చిన రహానే.. దానికి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తిరిగి రావడం కారణం కాదన్నాడు. అతనే తమ కెప్టెన్ కొసాగుతాడని, మసాల వార్తలు ఇక్కడ దొరకవని చురకలంటించాడు.

విమర్శకులపై స్పందిస్తూ..
తన బ్యాటింగ్ వైఫల్యం వస్తున్న విమర్శలపై కూడా రహానే స్పందించాడు.'రెండేళ్ల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడుతున్నాం. జట్టు కోసమే పరుగులు చేస్తాం తప్పా వ్యక్తిగత స్కోర్ల గురించి ఆలోచించం. నా గత 10-15 టెస్ట్‌లు చూస్తే నేను చేసిన పరుగులు కనిపిస్తాయి'అని తెలిపాడు. ఇక మెల్‌బోర్న్ టెస్ట్ సెంచరీ మినహా రహానే గత 6 ఇన్నింగ్స్‌లో 4, 22, 24, 37, 1 & 0 దారుణంగా విఫలమయ్యాడు. దాంతో రహానేపై సంజయ్ మంజ్రేకర్, వీవీఎస్ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. రహానే కెప్టెన్‌గా రాణించినా.. బ్యాట్స్‌మన్‌గా విఫలమవుతున్నాడని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.

స్పిన్నర్లు చెలరేగుతారు..
ఇక సెకండ్ టెస్ట్‌లో స్పిన్నర్లు చెలరేగుతారని, పిచ్‌పై తొలి రోజు నుంచే టర్న్ లభించే అవకాశం ఉందన్నాడు. 'సెకండ్ టెస్ట్‌కు సిద్దం చేసిన పిచ్ పూర్తి భిన్నమైనది. ఫస్ట్ డే నుంచే టర్న్ లభిస్తోంది. కానీ నేను గతంలో చెప్పినట్లు ఫస్ట్ సెషన్ ఆట పూర్తయ్యే వరకు వేచి చూడాలి. అప్పటి వరకు ఓ నిర్ణయానికి రావద్దు. దాన్ని బట్టి ముందుకు సాగాలి. ఫస్ట్ టెస్ట్‌లో ఎదురైన పరాభావాన్ని మేం మరిచిపోయాం. మా సాయశక్తుల పోరాడి విజయం కోసం కృషి చేస్తాం. 'అని తెలిపాడు.

అక్షర్ వచ్చాడు..
ఇక అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చాడని తెలిపిన రహానే.. తుది జట్టుపై మాత్రం ఎలాంటి హింట్ ఇవ్వలేదు. 'సెకండ్ టెస్ట్ కోసం అందరూ ఆటగాళ్లు సంసిద్దంగా ఉన్నారు. అక్షర్ కూడా గాయం నుంచి కోలుకొని సెలెక్షన్‌కు అందుబాటులో ఉన్నాడు. అయితే రేపటి మ్యాచ్ ఆడేవారి వివరాలేం నేను చెప్పడం లేదు. మా స్పిన్నర్లంతా సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నారు. ఫస్ట్ టెస్ట్‌లో కూడా మా బౌలర్లు రాణించారు. కానీ తొలి రెండు రోజులు ఫ్లాట్ వికెట్ ఏ మాత్రం బౌలర్లకు సహకరించలేదు. అలాంటి వికెట్‌పై ఎవరూ ఏం చేయలేరు. సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్‌పై టర్న్ లభించడంతో మా బౌలర్లు చెలరేగారు.'అని రహానే చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
