
చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ తొలి రోజు ఆటలో భారత బౌలర్లు తేలిపోయారు. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్(197 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 128 బ్యాటింగ్) సూపర్ సెంచరీకి తోడు ఓపెనర్ డామ్ సిబ్లీ(286 బంతుల్లో 12 ఫోర్లతో 87) రాణించడంతో ఆ జట్టు తొలి రోజు ఆటలో పై చేయి సాధించింది. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 200 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 89.3 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు చెలరేగగా.. వారిని అడ్డుకోవడంలో భారత్ బౌలర్లు సమష్టిగా విఫలమయ్యారు. అయితే ఇలా తొలి రోజు కేవలం మూడు వికెట్లే తీయడం టీమిండియాకు గత 6 ఏళ్లలో ఇదే తొలిసారి. 2015లో ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్ట్‌లో భారత్ కేవలం రెండు వికెట్లే తీసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే మూడు వికెట్లతో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన జోరూట్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
69-. ఇంగ్లండ్ తరఫున అత్యధికంగా 50 ప్లస్ స్కోర్లు చేసిన రెండో ఆటగాడిగా జోరూట్ గుర్తింపు పొందాడు. అతను ఇప్పటి వరకు 69 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేయగా.. అలెస్టర్ కుక్ ఒక్కడే 90 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసి జోరూట్ కన్నా ముందున్నాడు.
1- ఇక 98, 99, 100 వటెస్టుల్లో సెంచరీ సాధించిన ఏకైక క్రికెటర్‌గా జోరూట్ రికార్డు కెక్కాడు.
3- ఇక 100 టెస్ట్‌లు ఆడిన మూడో అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. జోరూట్ 30 ఏళ్ల 37 రోజులకు ఈ ఘనతను అందుకోగా.. అలిస్టర్ కుక్(28 ఏళ్ల 353 రోజులు), సచిన్ టెండూల్కర్(29 ఏళ్ల 134 రోజులు) అతని కన్నా ముందున్నారు.