న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: తడబడ్డ రిషభ్ పంత్.. ఫస్ట్ బాల్‌కే క్యాచ్ మిస్!

India vs England: Wicketkeeper Rishabh Pant fails to take a catch off Jasprit Bumrah’s first ball on Day 1

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ మళ్లీ తడబడ్డాడు. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఫస్ట్ బాల్‌కే ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. బుమ్రా వేసిన లెంగ్త్ డెలివరీని అంచనా వేయడంలో బర్న్స్ విఫలమయ్యాడు. దాంతో బంతి అతని బ్యాట్ అంచును తగులుతూ వికెట్ కీపర్ కుడిచేతి వైపు దూసుకెళ్లింది. అయితే పంత్ ఆ బంతిని అందుకోవడానికి డైవ్ చేసినప్పటికి అందకుండా గ్లోవ్స్‌ను తాకుతూ వెళ్లిపోయింది.

కష్టతరమైన క్యాచే అయినప్పటికీ స్పెషలిస్ట్ కీపర్ పట్టాల్సిన క్యాచే అది. ఆ బంతిని పంత్ అందుకుంటే టీమిండియాకు మంచి ఆరంభం దక్కేది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. క్యాచ్ వదిలేసిన రిషభ్ పంత్‌పై నెటిజన్లు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.

రిషభ్ నుంచి అవకాశాన్ని అందుకున్న రోరీ బర్న్స్(33), మరో ఓపెనర్ డొమినిక్ సిబ్లే(28 బ్యాటింగ్)తో శుభారంభాన్ని అందించాడు. అయితే అతని జోరుకు అశ్విన్ అడ్డుకట్టవేశాడు. ఈ తమిళనాడు స్పిన్నర్ వేసిన 24 ఓవర్ ఐదో బంతికి రోరీ బర్న్స్ కీపర్ రిషభ్ పంత్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డాన్ లారెన్స్(0)ను జస్‌ప్రీత్ బుమ్రా వికెట్ల ముందు బోల్తా కొట్టించి డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇదే స్వదేశంలో టెస్టుల్లో బుమ్రా తొలి వికెట్ కావడం గమనార్హం. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ డొమినిక్ సిబ్లేతో పాటు జోరూట్(11 బ్యాటింగ్) ఉండగా.. 34 ఓవర్లకు ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్​తో పెటర్నిటీ లీవ్ అనంతరం విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌తో మళ్లీ తన సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ జట్టులోకి పునరాగమనం చేయగా.. భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. షాబాజ్ నదీమ్, లోకల్ బాయ్స్ వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్‌లకు అవకాశం దక్కగా.. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది.

టెస్టు క్రికెట్లోనే చిరస్మరణీయ విజయంతో 2021ను ప్రారంభించిన భారత జట్టు ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌పై కన్నేసింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే ఈ సిరీస్‌ను గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా కోహ్లీ సేన డబ్ల్యూటీసీ ఫైనల్లోకి చేరుతుంది. ఇక పర్యాటక ఇంగ్లండ్‌ కూడా ఈ సిరీస్ నెగ్గి ఫైనల్ బెర్త్‌నే దక్కించుకోవాలని చూస్తుంది.

Story first published: Friday, February 5, 2021, 13:03 [IST]
Other articles published on Feb 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X