శార్ధూల్ ఠాకూర్‌ను తిట్టిన కోహ్లీ.. ఆలస్యంగా వెలుగులోకి వీడియో!

అహ్మదాబాద్: చెత్త బ్యాటింగ్.. పసలేని బౌలింగ్... పేలవ ఫీల్డింగ్‌తో భారత జట్టు మూల్యం చెల్లించుకుంది. ఇంగ్లండ్‌తో నరేంద్ర మోదీ మైదానం వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా విఫలమైన కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ పరాజయంతో 5 టీ20ల సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకంజలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర సన్నివేశం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా భారత ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో పదే పదే తప్పిదాలు చేశారు. సునాయస క్యాచ్‌లను చేజార్చడంతో పాటు పరుగులను అడ్డుకోవడంలో విఫలమయ్యారు.
ఈ క్రమంలోనే శార్దూల్ ఠాకూర్ చేసిన తప్పిదం కెప్టెన్ విరాట్ కోహ్లీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో ఈ యువపేసర్‌పై విరాట్ నోరుపారేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇంతకీ విషయం ఏంటంటే..?
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా యుజ్వేంద్ర చాహల్ వేదిసన 12వ ఓవర్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టో లెగ్ సైడ్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న శార్ధూల్ ఆలస్యంగా స్పందించాడు. అంతేగాకుండా బంతిని సరిగ్గా అందివ్వడంలో విఫలమయ్యాడు. దాంతో మిస్ ఫీల్డ్ జరిగి ఇంగ్లండ్‌కు మరో పరుగు అదనంగా వచ్చింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన కోహ్లీ.. శార్థూల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్య పదజాలంతో యువ పేసర్‌పై నోరు పారేసుకున్నాడు. అప్పటికే బెదురుగా చూసిన శార్దూల్, తన తప్పేమీ లేదన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు.

కోహ్లీని తప్పుబడుతున్న నెటిజన్లు..
ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు(కోహ్లి, చహల్)క్యాచ్‌లు వదిలేసినా పర్లేదు కానీ, శార్దూల్ సరిగా త్రో చేయనందుకు ఇంతలా కోప్పడ్డతారా''అని విమర్శిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 76 పరుగుల వద్ద బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ, 20 పరుగుల వద్ద బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్‌ను చహల్ వదిలేసిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటికే మ్యాచ్ దాదాపుగా భారత్ చేజారడంతో వాటిని అందుకున్నాపెద్దగా ఫలితం ఉండకపోయేది.

చిత్తయిన భారత్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ (46 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) వరుసగా రెండో అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాట్స్‌మెన్ ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' బట్లర్ (52 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిపించగా... బెయిర్‌స్టో (28 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. నాలుగో మ్యాచ్ ఇదే వేదికగా గురువారం జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications