Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ind vs Eng: రిషభ్ పంత్ నెత్తి మీద ఒక్కటేసిన రోహిత్ శర్మ.. వైరల్ వీడియో!

India vs England: Watch Rohit Sharma hilariously slaps Rishabh Pant on his head while celebrating a wicket

చెన్నై: టర్నింగ్ ట్రాక్‌పై స్పిన్ తంత్రాన్ని అద్భుతంగా వర్కౌట్ చేసిన భారత్.. సెకండ్ టెస్ట్‌లో పట్టు బిగించింది. ఓ వైపు అశ్విన్ మరోవైపు పేసర్లు సమయోచితంగా రాణించి.. ఇంగ్లీష్ టీమ్‌ను బెంబేలిత్తించారు. ఫస్ట్ టెస్ట్ ఓటమి నుంచి త్వరగా తేరుకున్న కోహ్లీసేన.. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో లెక్క సరిచేసే దిశగా దూసుకెళ్తుంది. అయితే ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. సహచర ఆటగాడు, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ నెత్తి మీద ఒక్కటేసాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 50 ఓవర్‌ అశ్విన్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ టేయిలెండర్ ఓలీ స్టోన్.. రోహిత్ శర్మ‌కు సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో ఆటగాళ్లంతా రోహిత్ శర్మను అభినందించగా.. అతని దగ్గరకు వచ్చిన రిషభ్ పంత్ నెత్తిపై రోహిత్ ఒక్కటేసాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక కోహ్లీ సేన బౌలింగ్‌కు తలవంచిన ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 59.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ (107 బంతుల్లో 42 నాటౌట్‌; 4 ఫోర్లు) ఒక్కడే కొంత పోరాడాడు. అశ్విన్‌ (5/43) ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. ఫలితంగా భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లోనూ పర్వాలేదనిపిస్తుంది.

సెకండ్ టెస్ట్ మూడో రోజైన సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 54/1తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన భారత్ జట్టు.. పుజారా(7), రోహిత్ శర్మ (26), రిషభ్ పంత్ (8), అజింక్య రహానె (10), అక్షర్ పటేల్(7) వికెట్లను వరుసగా కోల్పోయింది. 106 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రవిచంద్రన్ అశ్విన్(61 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ(62) ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. విరాట్ కోహ్లీ, కుల్దీప్ ఔటైనా.. ఇషాంత్ శర్మ సాయంతో అశ్విన్ పోరాడుతున్నాడు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 409 పరుగులుగా ఉంది.

Story first published: Monday, February 15, 2021, 14:18 [IST]
Other articles published on Feb 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+