For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్ సెంచరీ.. సిరాజ్ సెలెబ్రేషన్స్.. ఫ్యాన్స్ ఫిదా! (వీడియో)

India vs England: Watch Mohammed Siraj celebrates Ravi Ashwin’s century

చెన్నై: టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి అభిమానుల మనస్సులు దోచుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సూపర్ ఫెర్ఫామెన్స్‌తో సత్తా చాటిన ఈ హైదరాబాద్ గల్లీ బాయ్.. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో‌నూ తనదైన ఆటతో అదరగొడుతూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. స్వదేశంలో ఫస్ట్ టెస్ట్ ఆడుతున్న సిరాజ్.. తన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే వికెట్ తీసి ఔరా అనిపించాడు. ఇక మూడో రోజు ఆటలో ఆఖరి వికెట్‌‌కు బ్యాటింగ్‌కు దిగిన ఈ హైదరాబాద్ స్టార్.. క్రీజులో నిలిచి అశ్విన్ సెంచరీ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అశ్విన్ సెంచరీ పూర్తయిన వెంటనే ఎగిరి గంతేశాడు.

శభాష్ సిరాజ్..!

సహచరుడి సెంచరీ తనదే అన్నట్లుగా సిరాజ్ సెలెబ్రేట్ చేసుకోవడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని అసాధారణ పోరాటానికి అభిమానులంతా ఫిదా అయ్యారు. శభాష్ సిరాజ్ అంటూ కొనియాడుతున్నారు. సహచరుడి ఘనతను ఆస్వాదించే గొప్ప మనసు నీదంటూ మెచ్చుకుంటున్నారు. ఇక సిరాజ్ క్రీజులోకి వచ్చే సమయానికి అశ్విన్ 80 పరుగుల వద్ద ఉన్నాడు. దాంతో అతని సెంచరీ అసాధ్యమేనని అంతా భావించారు. కానీ సిరాజ్ 15 బంతులను డిఫెన్స్ చేసి తన సహచరుడి సెంచరీకి సాయం చేశాడు.

దద్దరిల్లిన చెపాక్..

దద్దరిల్లిన చెపాక్..

ఈ క్రమంలో అతను ఎదుర్కొనే ప్రతి బంతికి ప్రేక్షకుల నుంచి భారీ మద్దతు లభించింది. అరుపులు, చప్పట్లతో చెపాక్ దద్దరల్లింది. ఇక అశ్విన్ సెంచరీ పూర్తవ్వగానే తనలోని హిట్టర్‌ను నిద్రలేపిన సిరాజ్.. రెండు భారీ సిక్సర్లు కొట్టి అందర్ని ఆశ్చర్యపరిచాడు. తనకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉందని ఇంగ్లండ్ బౌలర్లకు చెప్పకనే చెప్పాడు. ఇక సిరాజ్ సూపర్ బ్యాటింగ్‌కు కామెంటేటర్లు కూడా అవాక్కయ్యారు. సూపర్ బ్యాటింగ్ అంటూ కొనియాడారు. తాను ఏమాత్రం టెయిలెండర్ కాడని, ఫించ్ హిట్టరని కొనియాడారు. హైదరాబాద్ దమ్ బిర్యాని దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడని ప్రశంసించారు. చివరకు అశ్వినే క్లీన్ బౌల్డ్ కాగా.. సిరాజ్ అజేయంగా నిలిచాడు. ఈ ఇద్దరు ఆఖరి వికెట్‌కు 49 పరుగులు జోడించడం విశేషం.

క్రీడా స్పూర్తి..

క్రీడా స్పూర్తి..

ఇక ఆస్ట్రేలియా పర్యటనలో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా సిరాజ్ క్రీడా స్పూర్తి చాటి యావత్ క్రికెట్ ప్రపంచం మన్ననలు అందుకున్న విషయం తెలిసిందే. గులాబీ సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ సందర్భంగా ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్‌ గ్రీన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. భారత బ్యాట్స్‌మన్ జస్‌ప్రీత్ బుమ్రా కొట్టినా షాట్ నేరుగా గ్రీన్ ముఖానికి తగిలింది. దాంతో గ్రీన్ కుప్పకూలగా.. నాన్‌స్ట్రైకర్‌‌గా ఉన్న సిరాజ్‌ పరుగు పూర్తి చేయకుండా నేరుగా గ్రీన్ దగ్గరకు వెళ్లి గాయాన్ని పరిశీలించాడు. పరుగు కన్నా అతని గాయానికే ప్రాధాన్యత ఇచ్చి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అప్పట్లో బీసీసీఐ #SpiritofCricket అనే యాష్ ట్యాగ్‌తో ట్విటర్ వేదికగా పంచుకోగా వైరల్ అయింది. ఇప్పుడు అశ్విన్ సెంచరీని సెలెబ్రేట్ చేసుకోవడాన్ని కూడా నెటిజన్లు అదే రితీలో కొనియాడుతున్నారు.

విజయం దిశగా భారత్..

విజయం దిశగా భారత్..

రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్‌లో టీమిండియా విజయానికి చేరువైంది. 482 పరుగుల భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్ రెండు వికెట్ల తీయగా లోకల్ బాయ్‌ అశ్విన్‌ ఒక్క వికెట్ పడగొట్టాడు. క్రీజులో జో రూట్ ( 2 బ్యాటింగ్), లారెన్స్‌ (19 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు 52/1 స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్(148 బంతుల్లో 14 ఫోర్లు ఒక సిక్స్‌తో 106) వీరోచిత సెంచరీ‌కి తోడు విరాట్ కోహ్లీ(149 బంతుల్లో 7 ఫోర్లతో 62) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌‌తో రాణించాడు.

Story first published: Monday, February 15, 2021, 18:33 [IST]
Other articles published on Feb 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+