భారత్ ఓటమిని ఎగతాళి చేసిన మైకేల్‌వాన్‌కు దిమ్మతిరిగే బదులిచ్చిన వసీం జాఫర్!

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు. మళ్లీ మాట్లాడకుండా తనదైన సెటైరిక్ కామెంట్‌తో నోరు మూయించాడు. ఇంగ్లండ్‌తో నరేంద్ర మోదీ మైదానం వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో కోహ్లీ సేన 8 వికెట్లతో తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమిని ఎగతాళి చేస్తూ మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు. భారత టీ20 జట్టు కన్నా ఐపీఎల్‌లోని ముంబై ఇండియన్స్ జట్టే బాగుంది'అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అయితే మైకేల్ వాన్ కామెంట్ అటు అభిమానులతో పాటు ఇటు వసీం జాఫర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
అందరికి ఆ అదృష్టం..
దాంతో ఈ భారత మాజీ ఓపెనర్ వెంటనే వాన్‌కు గట్టిగా బదులిచ్చాడు. 'మీ జట్టులాగా అందరికి విదేశీ ఆటగాళ్లను ఆడించే అదృష్టం ఉండదు కదా వాన్'అంటూ వసీం బదులిచ్చాడు. ఇంగ్లండ్ జట్టులోని ఇతర దేశాల ఆటగాళ్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ వసీం వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీంతో వసీం సమయస్పూర్తికి నెటిజన్లు సలాం చేస్తున్నారు. భలే బదులిచ్చావ్ బ్రో అంటూ కొనియాడుతున్నారు.

టెస్ట్ సిరీస్ నుంచి..
భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ మొదలైన నాటి నుంచి ఏదో ఒక విధంగా మైకేల్ వాన్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మూడో టెస్టులో భారత్ విజయం సాధించడం పట్ల మొతేరా పిచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల గుప్పించిన వాన్.. భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయినా వరుస ట్వీట్లతో పిచ్‌పై, భారత్‌పై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు. చివరకు భారత అద్భుత ప్రదర్శనకు తలవంచుతూ కోహ్లీసేనపై ప్రశంసలు కురిపించాడు. తాజాగా తొలి టీ20లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించడంతో.. మరోసారి భారత్‌పై తన విద్వేశాన్ని వెళ్లగక్కాడు.

అదరగొట్టిన ఆర్చర్
తొలి టీ20లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (48 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. ఇంగ్లండ్ పేసర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జోఫ్రా ఆర్చర్ 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలిచింది. ఇంగ్లండ్‌ను స్పిన్ ఉచ్చులో బిగించాలనుకున్న భారత వ్యూహం బెడిసి కొట్టింది. స్పిన్నర్లపై బ్యాట్ ఝుళిపించిన జేసన్ రాయ్ (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సునాయాస విజయా న్నందించాడు. ఆదివారం రెండో టీ20 మొతేరా వేదికగా జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications