గుడ్ మార్నింగ్ కోహ్లీ..
ఈ నేపథ్యంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీకి టీమిండియా మాజీ ఓపెనర్, దేశవాళీ దిగ్గజం వసీం జాఫర్ ఓ కోడింగ్ మెసేజ్ చేశాడు. ఆఖరి మ్యాచ్ తుది జట్టు విషయమై ట్విటర్ వేదికగా కొన్ని సలహాలు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 'గుడ్‌మార్నంగ్ కోహ్లీ. ఒక ఫొటో నీ ఉదయాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది. అవును, ఇది నిజం. రేపటి మ్యాచ్‌కు నీకు గుడ్ లక్'అంటూ ఓ ఫొటోను పంచుకున్నాడు. అందులో.. ''న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లో గల గ్రీన్‌విచ్ గ్రామంలో ఉన్న వాషింగ్టన్ స్క్వేర్ పార్కులో సూర్యస్తమయ సమయంలో చెస్ ఆటగాళ్లు ఇదిగో ఇలా కూర్చున్నారు''అని రాసి ఉంది.

ఆ ముగ్గురిని తీసుకోవాలని..
అయితే ఈ ట్వీట్‌తో ఆఖరి మ్యాచ్‌కు యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని వసీం కోడింగ్ లాంగ్వేజ్‌లో చెప్పాడు. అతని కోడింగ్ ట్వీట్‌ను అభిమానులు డీకోడ్ చేశారు. జాఫర్ ట్వీట్‌లో చెస్ అంటే చాహల్ అని, సన్ అంటే సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ అంటే సుందర్ అని, ఈ ముగ్గుర్ని తీసుకోవాలని కోహ్లీకి సూచిస్తున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో కోడింగ్ ట్వీట్ సూపర్ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఆ ముగ్గురే ఎందుకంటే..?
ఈ ముగ్గురి పేర్లే అని ఎందుకు భావిస్తున్నారంటే.. చాహల్ క్రికెటర్ అవడానికి ముందు చెస్ ప్లేయర్ అనే విషయం తెలిసిందే. ఇక వాషింగ్టన్ పార్కుతో నేరుగా వాషింగ్టన్ సుంధర్ అనే విషయం స్పష్టమవుతోంది. సన్ ప్రస్తావన ద్వారా సూర్యకుమార్ యాదవ్ అని ఈజీగా అర్థమవుతోంది. కాగా రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌ను ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చీల్చి చెండాడిని విషయం తెలిసిందే. దీంతో ఆఖరి మ్యాచ్‌లో వీరిద్దరి స్థానంలో చహల్, సుందర్‌ను తీసుకునే అవకాశం లేకపోలేదు. ఎటొచ్చీ బ్యాటింగ్ ఆర్డర్ మెరుగ్గా రాణిస్తున్నందు వల్ల సూర్యకుమార్‌కు మాత్రం మళ్లీ నిరాశ తప్పకపోవచ్చు.

మూడు మార్పులు ఖాయం..
గత మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్, కృనాల్ పాండ్యా కలిసి 16 ఓవర్లలో 156 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా, 14 సిక్సర్లు సమర్పించుకున్నారు! ఈ నేపథ్యంలో కుల్దీప్ స్థానంలో యజువేంద్ర చహల్ రావడం ఖాయమైంది. కృనాల్ స్థానంలో సుందర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వికెట్లు పడగొట్టకపోయినా... బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగల సామర్థ్యం సుందర్‌కు ఉంది.
పేస్ బౌలింగ్‌లో మరోసారి భువనేశ్వర్‌పైనే భారం ఉంది. ప్రసిధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ కూడా నిలకడగా రాణిస్తున్నప్పటికీ.. చివరి మ్యాచ్‌లో వైవిధ్యం కోసం వీరిద్దరిలో ఒకరిని తప్పించి నటరాజన్‌ను తీసుకునే అవకాశం ఉంది. లెఫ్టార్మ్ పేస్‌తో పాటు యార్కర్ల బలంతో నటరాజన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడని మేనేజ్‌మెంట్ నమ్ముతోంది.


Click it and Unblock the Notifications
