Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ఆట షురూ.. సుందర్ హాఫ్ సెంచరీ, అశ్విన్ ఔట్!

 India vs England: Washington Sundar leads India fightback with fifty

చెన్నై: ఇంగ్లండ్‌‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌ లో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జాక్ లీచ్ వేసిన 79వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన సుంధర్ 82 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో కెరీర్‌లో రెండో అర్థశతకాన్ని అందుకున్నాడు. కెరీర్‌లో రెండో టెస్ట్ మాత్రమే ఆడుతున్న సుందర్.. సొంతగడ్డపై తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

ఇక 257/6 ఓవర్ నైట్ స్కోర్‌తో నాలుగు రోజు ఆటను ప్రారంభించిన భారత్.. సుందర్, అశ్విన్(24) సూపర్ బ్యాటింగ్‌తో 300 మార్క్‌ ధాటింది. డామ్ బెస్ బౌలింగ్‌లో మిడాన్ మీదుగా అశ్విన్ అద్భుత సిక్సర్ కొట్టాడు. ఈ సూపర్ సిక్స్‌కు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ మొత్తం అభినందించింది. ఇలానే ఈ జోడీ ఓవర్‌కో బౌండరీ రాబట్టడంతో భారత స్కోర్ బోర్డు పరుగెత్తుతుంది. ప్రస్తుతం కొత్త బంతిని అందుకున్న ఇంగ్లండ్ పేసర్లు భారత బ్యాటింగ్ ధ్వయాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు.

ఆ వెంటనే లీచ్‌కు బంతిని అందించిన జోరూట్ ఫలితాన్ని రాబట్టాడు. అతని బౌలింగ్‌లో అశ్విన్(31) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో 6 వికెట్‌కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం భారత్ 87 ఓవర్లలో 7 వికెట్లకు 305 పరుగులు చేసింది. సుందర్(58 బ్యాటింగ్)‌తో పాటు క్రీజులో షాబాజ్ నదీమ్(0 బ్యాటింగ్) ఉన్నాడు. కోహ్లీ సేన ఇంకా 273 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 578 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే.

Story first published: Monday, February 8, 2021, 10:54 [IST]
Other articles published on Feb 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+