
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌లో యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌కు బదులు శ్రేయస్ అయ్యర్‌ను ఆడించడమే ఉత్తమమని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన 5టీ20ల సిరీస్‌లో ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు బ్యాట్‌తో రఫ్ఫాడించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు వన్డే సిరీస్‌కు కూడా ఎంపికవ్వడంతో తుది జట్టులో ఎవర్ని ఆడించాలనే విషయం టీమ్‌మేనేజ్‌మెంట్‌కు కష్టంగా మారింది.
ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్‌లైనప్‌పై స్పందించిన వీవీఎస్ లక్ష్మణ్ పలు సూచనలు చేశాడు. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కష్టమేనని, కానీ అనుభవం దృష్ట్యా శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇవ్వాలన్నాడు.
'శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌ల్లో ఒకరిని ఎంచుకోమంటే కాస్త కష్టం. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఎలా బ్యాటింగ్ చేస్తాడో అందరికి తెలిసిందే. సూర్యకు కూడా మంచి ప్రతిభ ఉంది. కానీ అనుభవమున్న శ్రేయస్‌కే నా ఓటు. అందుకే శ్రేయస్ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం మంచింది. అంతేకాకుండా ఒక రెండు ఇన్నింగ్స్‌లతో అయ్యర్‌ను పక్కన పెట్టడం కూడా సమంజసం కాదు.
ముంబై ఇండియన్స్ తరఫున సూర్య ఐపీఎల్‌లో అదరగొట్టాడు. కానీ అయ్యర్ కూడా భారత్ తరఫున నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు. అవకాశం ఇచ్చిన ప్రతీసారి తానెంటో నిరూపించుకుంటున్నాడు. కాబట్టి అయ్యర్‌కు అవకాశం ఇవ్వాలనేది నా అభిప్రాయం.'అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు(మంగళవారం) ఇరు జట్ల మధ్య పుణే వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.