
లక్ష్మణ్‌కు టెన్షన్..
ఐపీఎల్ కారణంగా వీదేశీ ఆటగాళ్లతో కూడా భారత ఆటగాళ్లకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. మాజీ క్రికెటర్లు కూడా ఏదో ఒక ఫ్రాంచైజీకి పనిచేస్తుండటంతో వారికి కూడా ఓవర్‌సీస్ ఆటగాళ్లతో అనుబంధం ఏర్పడింది. అయితే వీవీఎస్ లక్ష్మణ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్‌గా ఉండగా.. బెయిర్ స్టో ఆ జట్టులో కీలక ఆటగాడు. ఈ క్రమంలోనే ఫోర్త్ టెస్ట్ సందర్భంగా భజ్జీ.. లక్ష్మణ్‌పై సెటైర్లు పేల్చాడు. బెయిర్ స్టో వైఫల్యంపై లక్ష్మణ్ తెగా ఆందోళన పడుతున్నట్లున్నాడని వ్యాఖ్యానించాడు.

ఏప్రిల్ వరకు నాకు అనవసరం..
ఈ కామెంట్స్‌పై స్పందించిన లక్ష్మణ్.. అలాంటిదేం లేదని స్పష్టం చేశాడు. ఏప్రిల్ ముందు అతను ఫామ్‌లో ఉంటే చాలని, అంతకుముందు బెయిర్ స్టో పరుగులు చేసినా, చేయకున్నా తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఆ వెంటనే మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో తనకు చేరాలని ఉందని, కానీ లక్ష్మణ్ అడ్డుకుంటున్నాడని సరదాగా చెప్పుకొచ్చాడు. దీనికి లక్ష్మణ్ చాలా తెలివిగా స్పందించాడు. అభిమానులు ఆకాశ్ చోప్రాను కామెంట్రీ బాక్స్‌లోనే చూడాలనుకుంటున్నారని తెలిపాడు.

బెయిర్ స్టో మళ్లీ విఫలం..
ఇక ఫోర్త్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టో ఎన్ని పరుగులు చేస్తాడని లక్ష్మణ్‌ను ప్రశ్నించగా.. 15 పరుగులని వీవీఎస్ బదులిచ్చాడు. ఇక లక్ష్మణ్ అన్నట్లుగానే బెయిర్ స్టో 28 పరుగులకు ఔటయ్యాడు. బెన్ స్టోక్స్‌తో కలిసి క్రీజులో దాటిగా ఆడిన బెయిర్ స్టో.. సిరాజ్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమై వికెట్లు ముందు దొరికిపోయాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

121 పరుగులకే 5 వికెట్లు..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. డామ్ సిబ్లీ(2), జాక్ క్రాలీ(9)ని అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చగా.. కెప్టెన్ జోరూట్(5), బెయిర్ స్టోను సిరాజ్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఇక క్రీజులో కుదురుకొని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బెన్ స్టోక్స్(55)ను వాషింగ్టన్ సుందర్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో ఇంగ్లండ్ 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో డాన్ లారెన్స్(23), ఓలిపోప్ నిలకడగా ఆడుతున్నారు.


Click it and Unblock the Notifications












