న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్ బ్యాటింగ్ వైఫల్యంపై రాహుల్ గాంధీ వీడియోతో సెహ్వాగ్ సెటైర్స్.!

India vs England: Virender Sehwag posts Rahul Gandhi’s meme to mock England for their batting debacle in the third Test

అహ్మదాబాద్: భారత్‌తో మొతెరా స్టేడియం వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్ట్‌లో ఇంగ్లండ్ దారుణంగా విఫలమైంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కనీసం 50 ఓవర్లు కూడా ఆడకుండా 112 పరుగులకే కుప్పకూలింది. అయితే ఇంగ్లండ్ బ్యాటింగ్ వైఫల్యంపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు. అహ్మదాబాద్ మొతెరా‌లో రీకన్‌స్ట్రక్ట్ చేసిన సర్దార్ పటేల్ స్టేడియాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. చివరి నిమిషం వరకు స్టేడియం పేరు మార్చే విషయాన్ని రహస్యంగా ఉంచారు. దాంతో ఈ డై/నైట్ టెస్ట్‌కు రాజకీయరంగు పులుముకుంది.

ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్.. ఇంగ్లండ్ బ్యాటింగ్ వైఫల్యంపై రాహుల్ గాంధీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చాడు. ఓ బహిరంగ సభలో బై బై, టాటా అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. దానికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆటతీరు కూడా ఇలానే ఉందని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఇక సెహ్వాగ్ సెటైర్స్‌కు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం వీరూను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. క్లాసిక్ వీరూ అంటూ ప్రశంసించాడు. ప్రస్తుతం సెహ్వాగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ప్రధాన బౌలర్‌ కాకపోయినా... అక్షర్‌ పటేల్‌ (6/38) ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ పాలిట ప్రమాదకర బౌలరయ్యాడు. దీంతో బుధవారం మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 50 ఓవర్లయినా ఆడలేకపోయింది. 48.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ జాక్‌ క్రాలీ (53; 10 ఫోర్లు) ఒక్కడే భారత్‌ బౌలర్లను ఎదుర్కొన్నాడు. మరో స్పిన్నర్‌ అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. 100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్‌కు ఒక వికెట్‌ లభించింది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ఆట నిలిచే సమయానికి 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (82 బంతుల్లో 57 బ్యాటింగ్‌; 9 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ 2 వికెట్లు తీశాడు.

Story first published: Thursday, February 25, 2021, 12:25 [IST]
Other articles published on Feb 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X