విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్..గాల్లో డైవ్ చేస్తూ ఒంటిచేత్తో పట్టాడు!నేనే పట్టానా అంటూ ఆశ్చర్యం(వీడియో)

పూణే: అప్పుడప్పుడూ క్రికెట్‌లో వావ్ మూమెంట్స్ జరుగుతుంటాయి. అవి ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు.. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాట్స్‌మెన్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు. ఎక్కువగా ఫీల్డర్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. అలాంటి విన్యాసమే ఆదివారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సూపర్ మ్యాన్‌లా గాల్లో డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకుని వావ్ అనిపించాడు. కోహ్లీ ఫీల్డింగ్ విన్యాసానికి మైదానంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు, కామెంటేటర్లు సైతం బిత్తరపోయారు.
ఠాకూర్ తెలివిగా
మూడో వన్డేలో భారత ఫీల్డింగ్ సవ్యంగా సాగలేదు. ఎన్నో రనౌట్లు, క్యాచులు వదిలేశారు. భారత ఫీల్డింగ్ సవ్యంగా సాగి ఉంటే.. మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వచ్చేదే కాదు. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్ పదేపదే క్యాచులు జారవిడిచారు. ఓ వైపు సహచర ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో విఫలమైనప్పటికీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం అద్భుత రీతిలో క్యాచ్ అందుకుని అబ్బురపరిచాడు. ఇన్నింగ్స్ 40వ ఓవర్ వేసిన శార్ధూల్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్ (19: 22 బంతుల్లో 2x4) బంతిని కవర్స్ దిశగా ఫుష్ చేసి.. సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే ఠాకూర్ తెలివిగా స్లో డెలివరీని విసరడంతో.. రషీద్ బ్యాట్ తాకిన బంతి షార్ట్ కవర్‌లో కొద్దిగా గాల్లోకి లేచింది.

గాల్లో డైవ్ చేస్తూ ఒంటిచేత్తో పట్టాడు
ఆదిల్ రషీద్ కొట్టిన బంతి గాల్లోకి లేవడంతో.. సిల్లీ మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించిన విరాట్ కోహ్లీ మెరుపు వేగంతో కదిలాడు. ఎడమ చేతి వైపు డైవ్ చేసి ఒంటిచేత్తో బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. బంతి క్యాచ్‌గా దొరికిన తీరుకి.. నేనే పట్టానా అంటూ విరాట్ కోహ్లీనే మొదటగా ఆశ్చర్యపోయాడు. ముఖంలో ఆ హావభావాలు గమ్మత్తుగా అనిపించాయి. కోహ్లీ ఫీల్డింగ్ విన్యాసానికి మైదానంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు, కామెంటేటర్లు సైతం బిత్తరపోయారు. భారత ఆటగాళ్లు దగ్గరికి వచ్చి కోహ్లీని అభినందనలతో ముంచెత్తారు. కోహ్లీ క్యాచుకు సంబంచిన వీడియో నెట్టింట వైరల్ అయింది. క్యాచ్ చూసిన అందరూ ఒకవైపు ఆశ్చర్యపోతూ.. మరోవైపు కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

హార్దిక్ సూపర్ క్యాచ్
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మొదటలో రెండు క్యాచులు వదిలేసినా.. ఆపై అద్భుత ఫీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 31వ ఓవర్లో హార్దిక్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నాడు. మూడో బంతిని మొయిన్ అలీ (29) షాట్ ఆడగా.. హార్దిక్ ముందుకు పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి క్యాచ్ పట్టేశాడు. దీంతో దూకుడుగా ఆడుతున్న అలీ పెవిలియన్ చేరాడు. అయితే తాను క్యాచ్ వదిలేసిన స్టోక్స్ ఔటడంతో.. హార్దిక్ నవ్వుతూ క్యాచ్ పట్టిన శిఖర్ ధావన్‌కి సరదాగా దండం పెట్టాడు. ఇది మైదానంలో నవ్వులు పూయించింది.
కోహ్లీ పెదవి విరుపు
టీమిండియా పేలవ ఫీల్డింగ్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ పెదవి విరిచాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... 'క్యాచులు జారవిడిచినందుకు ఆటగాళ్లు నిరాశపడతారు. బాధపడుతూ క్యాచులు వదిలేస్తే కొన్నిసార్లు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా ఆటలో భాగమే. మా దేహభాష, తీవ్రత మాత్రం అద్భుతం. చివరికి మేం విజయం సాధించాం. ఏదేమైనా టాప్-2 జట్లు పోటీపడితే ఇలాంటి గొప్ప మ్యాచులే ఉంటాయి. ఇంగ్లండ్ అంత తేలిగ్గా వదలదని మాకు తెలుసు' అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
India vs England: జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్‌కి అవార్డులు.. మావాళ్లకు రాలేదని కోహ్లీ ఆశ్చర్యం! ఏమన్నాడంటే?