For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు.. హార్దిక్ పాండ్యా‌కు అందుకే బౌలింగ్‌ ఇవ్వలేదు: కోహ్లీ

India vs England: Virat Kohli reveals why Hardik Pandya Didnt bowl in 2nd ODI
Ind vs Eng 2nd ODI : Virat Kohli Reveals Why India Did Not Bowl Hardik Pandya In The 2nd ODI

పూణే: మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా పూణే వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో టీమిండియాపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జానీ బెయిర్‌స్టో (124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీకి.. బెన్‌ స్టోక్స్‌ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో ఇంగ్లండ్‌ ఇంకా 6.3 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. వీరి ధాటికి భారత‌ బౌలర్లంతా ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఐదుగురు బౌలర్లతోనే బౌలింగ్‌ చేయించిన కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చేత బౌలింగ్ చేయించలేదు.

పనిభారం వేయకూడదనే:

పనిభారం వేయకూడదనే:

'హార్దిక్ ‌పాండ్యా ఎందుకు బౌలింగ్ చేయలేదు. అతను టీ20 సిరీస్‌లో చక్కగా బౌలింగ్ వేశాడు. రెండో వన్డేలో ఆరవ బౌలర్‌గా పాండ్యాను ఉపయోగించుకోవాల్సింది' అని టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. అయితే హార్దిక్‌ చేత బౌలింగ్‌ ఎందుకు వేయించలేదనే విషయాన్ని విరాట్ కోహ్లీ స్పందించాడు. 'భవిష్యత్తు ప్రణాళిక దృష్యా హార్దిక్‌ను ప్రస్తుతం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం చేశాం. దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే రానున్న రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు టీ20 వరల్డ్‌ కప్‌ ఆడనున్నాం. వీటిని దృష్టిలో ఉంచుకొని అతనిపై ఎక్కువ పనిభారం వేయకూడదనే నిర్ణయానికి వచ్చాం' అని కోహ్లీ తెలిపాడు.

ఎంత ఫిట్‌గా ఉంటే.. అంత మంచిది:

ఎంత ఫిట్‌గా ఉంటే.. అంత మంచిది:

'హార్దిక్ పాండ్యా సేవలు ఎప్పుడు ఎక్కడా వాడాలనేదానిపై మాకు పూర్తి క్లారిటీ ఉంది. హార్దిక్ బ్యాటింగ్‌ నైపుణ్యంతో పాటు బౌలింగ్‌ సేవలు కూడా మాకు చాలా అవసరం. అందుకే ఈ సిరీస్‌లో అతనితో బౌలింగ్‌ చేయించడం లేదు. రానున్న టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌ కీలకం కానున్నాడు. అప్పటివరకు అతను ఎంత ఫిట్‌గా ఉంటే మాకు అంత మేలు జరుగుతుంది' అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. హార్దిక్ టీ20 సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 2019లో అతని వెన్నముకకు సర్జరీ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఎక్కువగా బౌలింగ్ చెయ్యట్లేదు.

ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చాడు:

ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చాడు:

'రెండో వన్డేలో బ్యాటింగ్‌ పరంగా మేము అద్భుతంగా ఉన్నాం. రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత కేఎల్ రాహుల్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశా. ఆ తర్వాత రాహుల్‌, రిషబ్ పంత్‌లు కలిసి ఆడిన ఇన్నింగ్స్‌ నిజంగా అద్బుతం. తనపై వస్తున్న విమర్శలకు రాహుల్‌ ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చాడు. పంత్‌ ఎప్పటిలాగే దూకుడైన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. పూర్తిగా బ్యాటింగ్‌ సహకరిస్తున్న పిచ్‌పై బౌలర్లు ఎలాంటి అద్భుతాలు చేయలేరు. బౌలర్లు అంతా విఫలమయ్యారన్నది నిజమే. కానీ తప్పంతా వారిదే అని మాత్రం అనను. మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

India vs England: బెన్ ‌స్టోక్స్‌ ఔటా.. నాటౌటా?! థర్డ్‌ అంపైర్‌ ఔటిచ్చి ఉంటే!!

Story first published: Saturday, March 27, 2021, 13:56 [IST]
Other articles published on Mar 27, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+