అప్పటి నుంచి కోహ్లీ సెంచరీ చేయలేదు! ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాన్స్! మరి 31లోనైనా 71 సాధిస్తాడా?

చెన్నై: విరాట్ కోహ్లీ.. ఈ పేరు వినగానే మనకు 'పరుగుల యంత్రం' అని గుర్తొస్తుంది. మనోడికి రికార్డుల రారాజు, చేజింగ్ కింగ్ అనే బిరుదులు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ బిరుదులు మాత్రం ఊరికే రాలేదు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా.. క్రీజులోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే.. స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు అలవోకగా బాదేస్తుంటాడు. అలాంటిది 16 నెలలుగా కనీసం ఒక్క ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్‌తో ఈ రోజు ప్రారంభం అయిన తొలి టెస్టులో అయినా శతకం చేయాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

30 ఇన్నింగ్స్‌లుగా సెంచరీ లేదు:
విరాట్ కోహ్లీ 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే/నైట్ టెస్టులో సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇప్పటివరకు 30 ఇన్నింగ్స్‌లు ఆడినా.. సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. గత ఆరు టెస్టుల్లో 4, 74, 14, 3, 19, 2 పరుగులు చేశాడు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పలుమార్లు సెంచరీకి చేరువైనా దురదృష్టవశాత్తూ మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించేలా కనిపించినా.. అజింక్య రహానేతో సమన్వయలోపంతో రనౌటయ్యాడు. దాంతో 2020 ఏడాదిలో ఒక్క శతకం కూడా సాధించలేకపోయాడు.

70 శతకాలు:
విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 87 టెస్టులు, 251 వన్డేలు, 85 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి మొత్తం 70 శతకాలతో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సార్లు మూడంకెల స్కోర్లు అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక స్కోర్ 94 నాటౌట్. కోహ్లీకి చివరి టెస్టు సెంచరీ తర్వాత చెన్నై మ్యాచ్ 31వ ఇన్నింగ్స్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడైనా విరాట్ 71వ శతకం సాధిస్తాడో లేదో చూడాలి. కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి:
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 87 టెస్టులాడి 53.4 సగటుతో 7318 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు) 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 251 వన్డేల్లో 59.3 సగటుతో 12040 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 60 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 85 టీ20లలో 50.5 సగటుతో 2928 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22,286 పరుగులు చేశాడు.

మరో రెండు విజయాలు సాధిస్తే:
విరాట్ కోహ్లీ ఇంతకుముందే టీమిండియా తరఫున అత్యుత్తమ టెస్టు కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ కన్నా ఎక్కువ విజయాలు అందించిన సారథిగా నిలిచాడు. అయితే స్వదేశంలో అత్యధిక విజయాలు అధించిన కెప్టెన్‌గా ప్రస్తుతం ధోనీ ఉన్నాడు. అతడి సారథ్యంలో టీమిండియా భారత్‌లో 21 విజయాలు సాధించగా.. కోహ్లీ నేతృత్వంలో 20 విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ సిరీస్‌లో కోహ్లీ మరో రెండు విజయాలు సాధిస్తే.. ధోనీకి చెందిన ఈ రికార్డును కూడా అధిగమిస్తాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్! కుల్దీప్‌కు షాక్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications