
కెప్టెన్‌గా అత్యధిక అర్ధ సెంచరీలు
అంతర్జాతీయ టీ20లో కెప్టెన్‌గా అత్యధిక అర్ధ సెంచరీల రికార్డు కేన్ విలియమ్‌సన్, విరాట్ కోహ్లీలపై ఉంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ సారథి ఇయాన్ మోర్గాన్ తొమ్మిది అర్ధ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ఏడు అర్ధ సెంచరీలతో ఫాఫ్ డుప్లెసిస్ ఈ జాబితాలో తదుపరి స్థానంలో ఉన్నాడు. డుప్లెసిస్ టీ20ల్లో సెంచరీ కూడా కొట్టాడు. డుప్లెసిస్ తర్వాత కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ మాత్రమే టీ20ల్లో సెంచరీ చేశాడు.

3వేల పరుగుల మైలురాయి
రెండో టీ20లో విరాట్ కోహ్లీ ఓ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 49 బంతుల్లోనే 73 పరుగులు చేయడంతో టీ20 క్రికెట్లో కోహ్లీ సాధించిన పరుగుల సంఖ్య 3వేల మైలురాయిని దాటింది. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. న్యూజీలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (2,839), టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (2,788) పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

27 సార్లు అర్ధ సెంచరీలు
టీ20ల్లో విరాట్ కోహ్లీ 27 సార్లు అర్ధ సెంచరీలు బాదాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక 50లు అతడివే. రోహిత్ శర్మ (25), డేవిడ్ వార్నర్ (19), మార్టిన్ గుప్టిల్ (19) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 12వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా కూడా విరాట్ నిలిచాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (15440), దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ (14878) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కోహ్లీ హాఫ్ సెంచరీ
మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తన వందో అంతర్జాతీయ టీ20లో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోవడంతో.. మొదట బ్యాటింగ్ చేసిన కొహ్లీసేన నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 77 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఆపై ఇంగ్లండ్ సునాయాసంగా ఛేదించింది. జోస్ బట్లర్ (52 బంతుల్లో 83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టడంతో లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 18.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 158 పరుగులు చేసింది.
India vs England: భారత్‌లో టాస్ గెలిస్తే.. ప్రపంచకప్ గెలిచేస్తారేమో: వాన్ సెటైర్


Click it and Unblock the Notifications
