India vs England: ప్రాక్టీస్‌లో హెలికాప్టర్ షాట్‌తో ధోనీని గుర్తు చేసిన విరాట్ కోహ్లీ!

చెన్నై: ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌కు టైమ్ దగ్గరపడడంతో టీమిండియా ప్రాక్టీస్ జోరు పెంచింది. క్వారంటైన్ పూర్తి చేసుకొని సోమవారమే ఔట్ డోర్ సెషన్‌లో పాల్గొన్న కోహ్లీసేన.. చెపాక్ స్టేడియంలో మంగళవారం పూర్తి స్థాయి నెట్‌సెషన్‌లో పాల్గొంది. అటూ ఒక రోజు ఆలస్యంగా క్వారంటైన్ ముగించుకున్న ఇంగ్లండ్ కూడా ప్రాక్టీస్ ప్రారంభించింది. ఇక టీమిండియా ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. అయితే ప్రాక్టీస్ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనీ గుర్తుకు తెస్తూ.. హెలికాప్టర్ షాట్‌ను సైగలతో అనుకరించడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
నిక్ వెబ్ పర్యవేక్షణలో..
ఇక ఆసీస్ టూర్ నుంచి వచ్చి కేవలం మూడు రోజులే కుటుంబ సభ్యులతో గడిపిన క్రికెటర్లు తర్వాత ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండడంతో స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ హెడ్ కోచ్ నిక్ వెబ్, కోచ్ సోహమ్ దేశాయ్ వారితో సరదాగా సాగే డ్రిల్స్ చేయించారు. 'ఫుట్ వాలీ'పేరుతో ఓ గేమ్ ఆడించారు. రెండు గ్రూపులుగా విడిపోయిన ప్లేయర్లు.. మధ్యలో కుర్చీలు పెట్టి ఫుట్‌బాల్‌తో టెన్నిస్ లాంటి గేమ్ ఆడారు. ఈ సెషన్ చాలా ఫన్‌గా సాగింది. అలాగే, ప్లేయర్లంతా గ్రూప్‌గా గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ చేశారు. తర్వాత నిక్ వెబ్ సూచనలతో పలు రకాల ఎక్సర్‌సైజులు చేశారు.

రోహిత్‌తో కలిసి..
కోహ్లీ తన జట్టు సహచరులను ఎంకరేజ్ చేయడంలో ముందువరుసలో ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రాక్టీస్‌లో మాయాంక్ అగర్వాల్‌ను ఆటపట్టిస్తూ కనిపించిన కోహ్లీ తన సైగలతో ఆటగాళ్లలో జోష్ నింపాడు. అనంతరం ధోనీ మార్క్ హెలికాప్టర్ షాట్‌ను గుర్తుచేస్తూ రెండు చేతులతో సైగలు చేశాడు. అనంతరం రోహిత్ శర్మతో కలిసి ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ సమక్షంలో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు.

కూతురు పుట్టిన సంతోషంలో..
ఆసీస్ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ విజయాన్ని అందుకున్న టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇక అడిలైడ్ టెస్టు అనంతరం కోహ్లీ పెటర్నిటీ లీవ్‌పై స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. కోహ్లీ గైర్హాజరీలో అజింక్యా రహానే సారథ్యంలోని టీమిండియా 2-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇక 15 రోజుల విరామం అనంతరం బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీ కూతురు పుట్టి సంతోషంలో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు.

ఇంగ్లండ్ షురూ చేసింది..
టీమిండియా కంటే ఒకరోజు ఆలస్యంగా మైదానంలోకి వచ్చిన ఇంగ్లండ్ టీమ్ కూడా మంగళవారం పూర్తి స్థాయి ప్రాక్టీస్‌లో పాల్గొంది. కెప్టెన్ జో రూట్, జేమ్స్ అండర్సన్, జోఫ్రా ఆర్చర్, రోరి బర్న్స్‌తో పాటు ఇతర ఆటగాళ్లంతా మైదానంలో చెమటలు చిందించారు. ఇంగ్లండ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ ఈ సెషన్‌ను పర్యవేక్షించారు. చెన్నై వేదికగా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య ఫస్ట్ టెస్ట్ జరగనుంది. ఇక ఈ సిరీస్‌ను టీమిండియా 3-1, 3-0, 2-0, 2-1 తేడాతో గెలిస్తేనే.. జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే ఆసీస్ దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకోవడంతో న్యూజిలాండ్ జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications