Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: తొలి టెస్ట్ ఓటమిపై కోహ్లీ ఏమన్నాడంటే?! ఆ ఇద్దరికి వార్నింగ్!!

India vs England: Virat Kohli feels Indian bowlers didnt do enough to create pressure on England

చెన్నై: చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపై భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. ఇంగ్లండ్ జట్టు ప్రొఫెషనల్‌గా ఆడిందని ప్రశంసించిన కోహ్లీ.. పిచ్ చాలా స్లోగా ఉండడంతో బంతితో రాణించలేకపోయామన్నాడు. బౌలింగ్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. తమ దేహభాష, ఆటలో స్థాయికి తగిన తీవ్రత కనిపించలేదన్నాడు. తొలి టెస్టులో కొన్ని పొరపాట్లు చేశామని.. మరింత నిలకడగా ఆడాల్సిందని కోహ్లీ పేర్కొన్నాడు. 420 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీసేన 227 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే.

ఒత్తిడి పెంచాల్సింది:

ఒత్తిడి పెంచాల్సింది:

మ్యాచ్ అనంతరం భారత సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మా ఆటగాళ్ల దేహభాష, తీవ్రత స్థాయికి తగ్గట్టుగా లేవు. రెండో ఇన్నింగ్స్‌లో మేం మరింత మెరుగ్గా ఉన్నాం. బ్యాటింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌ రెండో అర్ధ భాగంలోనూ మెరుగ్గానే ఉన్నాం. మేం ఎక్కడ బాగున్నామో.. ఎక్కడ బాగాలేమో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే.. మేమెప్పుడూ మెరుగవ్వాలనే కోరుకుంటాం. ఈ మ్యాచులో ఇంగ్లండ్‌ మా కన్నా మెరుగ్గా, చాలా నిలకడగా ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్‌ బౌలర్లు, అశ్విన్ సమష్టిగా బౌలింగ్‌ చేశారు. అయితే పరుగుల్ని నియంత్రించి ఒత్తిడి పెంచాల్సింది. పిచ్‌ మందకొడిగా ఉండి బౌలర్లకు సాయపడకపోవడంతో బ్యాట్స్‌మెన్‌ సులభంగా స్ట్రైక్‌ రొటేట్‌ చేశారు' అని అన్నాడు.

ఆ ఇద్దరికీ వార్నింగ్:

ఆ ఇద్దరికీ వార్నింగ్:

'షాబాజ్ నదీమ్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అంచనాల్ని అందుకోలేకపోయారు. ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచడంలో ఇద్దరూ విఫలమయ్యారు. ప్రణాళికల అమల్లో లోపాలు ఆమోదయోగ్యమే కానీ వైఖరి సరిగ్గా ఉందా లేదా అన్నదే అత్యంత కీలకం' అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. పరోక్షంగా కోహ్లీ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లు వేసిన సుందర్ ఒక వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతనితో కేవలం ఒకే ఒక ఓవర్‌ని కోహ్లీ బౌలింగ్ చేయించాడు. ఇక నదీమ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు. అయితే ధారాళంగా పరుగులు ఇచ్చాడు.

గట్టి పోటీ ఇస్తాం:

గట్టి పోటీ ఇస్తాం:

'మ్యాచులో టాస్‌ కీలకంగా మారింది. అయితే ఇంగ్లండ్ అద్భుతంగా ఆడిందనే చెప్పాలి. మేం మా తప్పులు, వైఫల్యాలను అంగీకరించి తీరాల్సిందే. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే. తర్వాత మూడు మ్యాచుల్లో మేం గట్టి పోటీ ఇస్తామని పక్కగా చెప్పగలను. తొలి టెస్టులా వాటిని చేజారనీయం' అని విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులతో రాణించాడు. కాగా ఫిబ్రవరి 13 నుంచి చెన్నైలోనే రెండో టెస్టు ప్రారంభం కానుంది.

పంత్‌కు సరదాగా ఉండటం ఇష్టం:

పంత్‌కు సరదాగా ఉండటం ఇష్టం:

తొలి ఇన్నింగ్స్‌లో మైదానంలో రిషబ్ పంత్‌ వ్యవహరించిన తీరుపై విరాట్ కోహ్లీ స్పందించాడు. అతడికి మైదానంలో సరదాగా ఉండటం ఇష్టమని, తనతో పాటు ఇతరులను కూడా నవ్విస్తూ గంభీర వాతావరణాన్ని తేలిక చేశాడన్నాడు. ఇక ముందు కూడా ఇలాంటివి కొనసాగుతాయని కోహ్లీ తెలిపాడు. రెండో టెస్ట్ చెన్నైలోనే జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ఏడాది త‌ర్వాత తొలిసారి ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌నున్నారు.

India vs England: టీమిండియాపై ఇంగ్లండ్ విజయం.. కెప్టెన్‌గా జో రూట్‌ అరుదైన రికార్డు!!

Story first published: Tuesday, February 9, 2021, 17:55 [IST]
Other articles published on Feb 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+