For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli నోరు తెరిస్తే బూతు మాటలే.. నిక్‌ కాంప్టన్‌పై మండిపడుతున్న భారత అభిమానులు!!

India vs England: Indian fans slams Nick Compton over tweet against on Virat Kohli

లండన్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్‌ నిక్‌ కాంప్టన్‌పై భారత అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై కాంప్టన్‌ సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నాడు. 'కోహ్లీ నోరు తెరిస్తే బూతు మాటలే' అంటూ కాంప్టన్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో ఇంగ్లండ్ ప్లేయర్స్ భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాను దూషించినప్పుడు.. లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుందని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీపై జేమ్స్ అండర్సన్‌ అశ్లీల పదజాలం వాడినప్పుడు వినపడలేదా? అని భారత ఫాన్స్ ఘాటుగా బదులిస్తున్నారు. ఇంగ్లండ్ మాజీలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

నోటికి పని చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్స్

నోటికి పని చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్స్

రెండో టెస్టులో ఇంగ్లండ్, భారత్ జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగడంతో.. ఆధిపత్యం చెలాయించేందుకు మొదటగా ఇంగ్లండ్ ఆటగాళ్లు గొడవలు పడ్డారు. మూడో రోజు ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే.. ఆదివారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అండర్సన్‌ మధ్య మరో వివాదం చోటుచేసుకుంది.

చివరి రోజు బుమ్రాని రెచ్చగొట్టారు ఇంగ్లండ్ ప్లేయర్స్. మార్క్‌ వుడ్, అండర్సన్ షార్ట్ పిచ్ బంతులతో బుమ్రాని గాయపర్చే ప్రయత్నం చేస్తూనే తమ నోటికి పని చెప్పారు. బట్లర్ కూడా బుమ్రాపై మాటల యుద్దానికి దిగాడు.

నోరు తెరిస్తే బూతు మాటలే

నోరు తెరిస్తే బూతు మాటలే

ఆ తర్వాత టీమిండియా ఏమాత్రం తగ్గకుండా ఘాటుగా బదులిచ్చింది. అటు మాటలు బదులివ్వడమే కాకుండా ఆటలోనూ తిరుగులేని ప్రదర్శన చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలో చురుగ్గా కదులుతూ ఆటగాళ్లను ఉత్సాహపరిచాడు. మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ మాజీ క్రికెటర్‌ నిక్‌ కాంప్టన్‌ భారత ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు.

'నోరు తెరిస్తే విరాట్‌ కోహ్లీ కన్నా ఎక్కువ బూతులు మాట్లాడే వ్యక్తి మరొకరు ఉండరు. 2012లో నన్ను వేలెత్తి చూపుతూ చేసిన దూషణను ఇప్పటికి మర్చిపోలేను. అలా చేసి కోహ్లీ తనను తానే తక్కువ చేసుకున్నాడు. దీనివల్ల జో రూట్‌, సచిన్ టెండ్యూలక్ర్, కేన్ విలియమ్సన్‌ ఎంత హుందాగా ఉంటారో తెలుస్తోంది' అని కాంప్టన్‌ ట్వీట్‌ చేశాడు. దీన్ని చూసిన భారత అభిమానులు తీవ్రంగా స్థాయిలో మండిపడుతున్నారు.

ఎన్‌సీఏ రేసులో రాహుల్ ద్రవిడ్‌ ఒక్కడే.. ఇక ఎంపిక లాంఛనమే! కానీ..!!

అప్పుడు నువ్వెక్కడున్నావు

అప్పుడు నువ్వెక్కడున్నావు

'రవిచంద్రన్ అశ్విన్‌ను జేమ్స్ అండర్సన్‌ అవమానించినప్పుడు, వీడ్కోలు పోరులో వెర్నాన్ ఫిలాండర్‌ను జోస్ బట్లర్‌ దూషించినప్పుడు నువ్వెక్కడున్నావు?. నిజానికి జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఇదంతా మొదలుపెట్టింది ఇంగ్లండ్ జట్టే కదా?' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'ఇంగ్లండ్ మాజీలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఇంగ్లండ్ జట్టు బుమ్రాతో ప్రవర్తించిన తీరును ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ సహా మాజీ క్రికెటర్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ దిగ్గజాలే తమ జట్టు ఆటతీరును చూసి సిగ్గుపడుతున్నట్టు ప్రకటించారు. లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో భారత్ 151 పరుగుల భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

రాహుల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

ఇదే విషయమై టీమిండియా ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ ఇంగ్లండ్ జట్టుకు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. 'రెండు కఠినమైన జట్లు తలపడితే ఇలాగే ఉంటుంది. ఆటగాళ్ల మధ్య గొప్ప పోరాటాలు దర్శనమిస్తాయి. గొప్ప నైపుణ్యాలు బయటపడతాయి. ఈ పోరాటం గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. గెలుపు కోసం రెండు జట్లు తీవ్రంగా కృషి చేశాయి. శ్రుతి మించని కవ్వింపులకు మేమేమీ వెనుకాడం. మీరు మాలో ఒకరి వెంట పడితే.. మేం మొత్తం 11 మందిమి మీ వెంట పడతాం. ఇంగ్లండ్ ఆటగాళ్ల కవ్వింపులే మా బౌలర్లలో కసి పెంచాయి. తమ సత్తా ఏంటో చూపించాలని అనుకున్నారు. ఈ మ్యాచులో వారి ప్రదర్శన అసమానం. వారిని ఎంత పొగిడినా తక్కువే' అని రాహుల్‌ అన్నాడు.

పూర్తి వీడియో ఇదే

జేమ్స్ అండర్సన్‌, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి స్పష్టత లేదు. కానీ తాజాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో బయటకు వచ్చింది. కోహ్లీ, అండర్సన్ మధ్య సంభాషణ ఎలావుందంటే?

కోహ్లీ: ఏమిటి అది.. బుమ్రాను తిట్టినట్లు మళ్లీ నన్ను తిడుతున్నావా?

అండర్సన్: నువ్వు కూడా నన్ను కావాల్సినంత తిట్టుకో

కోహ్లీ: నువ్వు నీ సొంత రూల్స్ ప్రకారం ఆడుతున్నావు.. నన్ను బూతులు తిడుతున్నావు? నీ అయ్య జాగిరన్నట్లు పిచ్‌పై పరుగెడుతున్నావ్?

అండర్సన్: నాకు తెలిసి బౌలర్లు క్రీజు వరకు పరుగెడుతారు

కోహ్లీ: యే.. యే.. చిర్ప్.. చిర్ప్.. ముస్సలోడివయ్యావు కదా.. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావ్!

Story first published: Thursday, August 19, 2021, 11:54 [IST]
Other articles published on Aug 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+