ఓయ్ అంపైర్ ఏంటిది..? జోఫ్రా ఆర్చర్‌పై విరాట్ కోహ్లీ ఫిర్యాదు (వీడియో)

చెన్నై: ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయం తర్వాత సొంత మైదానంలో అత్యంత చెత్త పెర్ఫామెన్స్‌తో భారత జట్టు నేలకు దిగింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను ఘోర ఓటమితో ఆరంభించింది. చెపాక్ స్టేడియంలో మంగళవారం ముగిసిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 227 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. దాంతో సిరీస్‌లో 1-0తో లీడ్ సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విషయం ఏంటంటే..?
ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా అశ్విన్ బౌలింగ్‌లో బంతిని పాయింట్ దిశగా హిట్ చేసిన జోప్రా ఆర్చర్.. జాక్ లీచ్‌తో కలిసి సింగిల్‌ను పూర్తి చేశాడు. అయితే.. సింగిల్ తీసే క్రమంలో జోప్రా ఆర్చర్ పిచ్‌లోని డేంజర్ జోన్‌లో అడుగులు వేసుకుంటూ వెళ్లాడు. దాంతో.. విరాట్ కోహ్లీ ఫీల్డ్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోలో అంపైర్‌కు ఫిర్యాదు చేస్తూ కోహ్లీ అన్న మాటలు స్టంప్స్ మైక్‌లో స్పష్టంగా రికార్డు అయ్యాయి.
ఓయ్.. నితిన్ మీనన్..
జోప్రా ఆర్చర్ పిచ్‌పై డేంజర్ జోన్‌లో పరుగెత్తినా.. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ పట్టించుకోకపోవడంతో విరాట్ కోహ్లీ స్పందించాడు. 'ఓయ్ మీనన్ (నితిన్ మీనన్).. ఏంటిది? అతను (జోప్రా ఆర్చర్) పిచ్ మధ్యలో పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు''అని విరాట్ కోహ్లీ హిందీలో గట్టిగా అరుస్తూ ఫిర్యాదు చేశాడు. ఈ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. పిచ్‌లోని డేంజర్ జోన్‌లో ఆటగాళ్లు పరుగెత్తితే.. అందులో షూ ముద్రలు పడే అవకాశం ఉంది.

స్పిన్నర్లకు అనుకూలిస్తుందని..
క్రీజుకి అత్యంత సమీపంలో ఆ షూ ముద్రలు పడితే.. అది స్పిన్నర్లకు కలిసి రానుంది. వన్డే, టీ20ల్లో ఆ ముద్రలు పెద్దగా ప్రభావం చూపవు. కానీ.. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లో మాత్రం అవి మ్యాచ్ ఫలితాన్నే మార్చేసే అవకాశం ఉంది. అందుకే కొన్ని జట్ల టెయిలెండర్లు బ్యాటింగ్ సమయంలో ఉద్దేశపూర్వకంగానే పిచ్‌లోని డేంజర్ జోన్‌పై పరుగెత్తేందుకు ప్రయత్నిస్తుంటారు. ఫస్ట్ టైమ్ అలా పరుగెత్తితే వార్నింగ్‌తో సరిపెట్టే అంపైర్లు.. రెండోసారి మాత్రం ఆ తప్పిదానికి పాల్పడితే 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు.

చిత్తుగా ఓడిన భారత్..
420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 58.1 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (104 బంతుల్లో 72; 9 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (83 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ లీచ్‌కు 4 వికెట్లు దక్కగా, పేసర్ అండర్సన్ 3 కీలక వికెట్లు తీశాడు. చివరి రోజు తొలి సెషన్‌లో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ ఇన్నింగ్స్ టీ విరామానికి ముందే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 'డబుల్ సెంచరీ' చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications