Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: శుభ్‌మన్ గిల్‌కు గాయం.. పృథ్వీషాకు పిలుపు!

India vs England: Virat Kohli and co Wants Prithvi Shaw as injured Shubman Gill’s replacement

న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీషాకు ఇంగ్లండ్ పర్యటనలోని కోహ్లీసేన నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనలో ఉన్న అతడిని ఇంగ్లాండ్‌కు పంపించాలని బీసీసీఐ భావిస్తోందట. గాయపడిన శుభ్‌మన్‌ గిల్‌ స్థానాన్ని అతడితో భర్తీ చేయాలన్నది జట్టు యాజమాన్యం ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం యూఏఈకి వెళ్లిన కోహ్లీసేన.. ప్రస్తుతం విరామ సమయాన్ని ఆస్వాదిస్తోంది.

ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సేవలను కోల్పోయింది. అతను ఎడమ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడని, 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసమరని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. దాంతో అతను ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

 ముందు జాగ్రత్తగా..

ముందు జాగ్రత్తగా..

ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, అభిమన్యు ఈశ్వరన్‌ అతనికి ప్రత్యామ్నాయంగా జట్టులో ఉన్నారు. రోహిత్‌ శర్మతో పాటు మయాంక్‌ అగర్వాల్‌ను ఓపెనింగ్‌ చేయించే అవకాశం ఉంది. మరోవైపు కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అరంగేట్రం చేయలేదు కాబట్టి అభిమన్యు ఈశ్వరన్‌కు వెంటనే అవకాశం ఇవ్వకపోవచ్చు. సుదీర్ఘ సిరీస్‌ కావడంతో వీరిలో ఎవరైనా గాయపడే అవకాశం ఉందని, ముందు జాగ్రత్తగా పృథ్వీ షాను పిలుపించే అవకాశం ఉన్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

 సూపర్ ఫామ్‌లో పృథ్వీ షా

సూపర్ ఫామ్‌లో పృథ్వీ షా

'పృథ్వీ షా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు శ్రీలంకలో పర్యటిస్తున్నాడు. అతడు ఇంగ్లండ్‌కు వెళ్తే జట్టుకు సౌకర్యంగా ఉంటుంది. గిల్‌కు గాయమై ఐదు రోజులైనా సెలక్టర్లు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రెండేళ్ల క్రితం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రాణించిన అభిమన్యు ఈశ్వరన్‌పై పూర్తిగా ఆధారపడే అవకాశం లేదు. అందుకే వీరోచిత ఫామ్‌లో ఉన్న పృథ్వీ షాను తీసుకోవడమే సమయోచితంగా అనిపిస్తోంది. ఇప్పటికే అతని గురించి అందరికీ తెలుసు. జట్టు యాజమాన్యం అతని అవసరం ఉందని చెబితే బీసీసీఐ అతన్ని ఎందుకు పంపించదు?' అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

దుమ్మురేపిన షా..

దుమ్మురేపిన షా..

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమైన పృథ్వీ షా జట్టులో చోటు కోల్పోయాడు. అతని బ్యాటింగ్‌ టెక్నిక్‌లో కొన్ని సమస్యలు ఉండటంతో టీమ్‌మేనేజ్‌మెంట్ అతన్ని పక్కకు పెట్టింది. స్వదేశం వచ్చాక తన లోపాలను సవరించుకున్న షా.. దేశవాళ్లీ క్రికెట్‌లో దుమ్మురేపాడు. విజయ్ హజారే ట్రోఫీలో 800కు పైగా పరుగులు చేశాడు. కరోనాతో మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్‌ 2021 సీజన్‌లోనూ అదరగొట్టాడు. ఇక పృథ్వీ షా స్థానంలోనే టెస్ట్ జట్టులోకి వచ్చిన శుభ్‌మన్‌గిల్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడిన షా గాయపడటంతో ఇంగ్లాండ్‌ పర్యటనకు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

Story first published: Saturday, July 3, 2021, 15:57 [IST]
Other articles published on Jul 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+