
కలవర పెడుతున్న గాయాలు..
కరోనా నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ సెలక్టర్లు జంబో జట్టునే ప్రకటించారు. మరికొన్ని నెలల్లోనే టీ20 ప్రపంచకప్ ఉండటంతో ఆటగాళ్ల సత్తాను పరీక్షించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇంతలోనే క్రికెటర్లు గాయాలు, ఫిట్‌నెస్ ఇబ్బందులతో దూరమవ్వడం కలవర పెడుతోంది.
తమిళనాడు యువపేసర్ తంగరసు నటరాజన్ ఐపీఎల్ 2020లో అదరగొట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌బౌలర్‌గా వెళ్లి మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. తన బలమైన యార్కర్లను నిక్కచ్చిగా విసురుతూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు.

నట్టూ కీలకం..
ఇంగ్లండ్‌తో సుదీర్ఘ ఫార్మాట్ ఆడలేకపోయిన నట్టూ భుజ గాయం కారణంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. మార్చి 12 వరకు అతను అందుబాటులో ఉండడని ఎన్‌సీఏ అధికారులు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు జట్టు యాజమాన్యానికి సమాచారం ఇచ్చింది. వ్యక్తిగత కారణాలతో బుమ్రా దూరమైన నేపథ్యంలో నట్టూ అవసరం కోహ్లీసేనకు ఎంతగానో ఉంది.

పాపం వరుణ్..
ఐపీఎల్, టీఎన్‌పీఎల్ లీగుల్లో అదరగొట్టిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఆఖరి నిమిషంలో ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. ఎన్‌సీఏలో కోలుకుంటున్న అతన్ని సెలక్టర్లు ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేశారు. బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన 2 కిలో మీటర్ల ఫిట్‌నెస్ టెస్ట్‌లో రెండుసార్లు విఫలమయ్యాడని ఎన్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి. ఫిట్‌నెస్ ప్రమాణాలకు ధీటుగా అతని దేహదారుఢ్యం లేదని తెలుస్తోంది. దాంతో అతడు జట్టుకు దూరం కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.

చాహర్‌కు చాన్స్
రాజస్థాన్ రాయల్స్‌కు గతేడాది అద్భుత విజయాలు అందించిన రాహుల్ తెవాటియాది కూడా ఇలాంటి పరిస్థితినే. రెండోసారి అతన్ని ఫిట్‌నెస్ టెస్టు నిర్వహించనున్నారు. టీమిండియాకు ఆడాలన్న అతని కల సులభంగా నెరవేరేలా కనిపించడం లేదు. జట్టులో అతనికి ఎలాంటి పాత్ర ఇవ్వాలన్న దానిపైనా ఇంకా స్పష్టత లేదు. కాగా ఇప్పటికే నెట్‌బౌలర్‌గా అహ్మదాబాద్‌లో ఉన్న రాహుల్ చాహర్‌ను చక్రవర్తి స్థానంలో ఎంపిక చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications












