India vs England Under-19 Final మ్యాచ్ ఎప్పుడూ? ఎన్ని గంటలకంటే? పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు..?

నార్త్ సౌత్(ఆంటిగ్వా): బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ప్లానింగ్ ఇలా అన్నింటా తిరుగులేని పెర్ఫామెన్స్ చేస్తున్న యువ భారత్ అండర్ 19 ప్రపంచకప్‌లో ఐదోసారి చాంపియన్‌గా నిలిచేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. కెప్టెన్ యశ్ ధూల్ కెప్టెన్సీలో ఖతర్నాక్ ఆడుతున్న మన కుర్రాళ్ల టీమ్ వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో టైటిల్ ఫైట్‌కు రెడీ అయింది. శనివారం వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ ఫైట్‌లో ఇంగ్లీష్ టీమ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్‌లో బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి భారత్ ఫైనల్ చేరగా.. అంతకుముందే అఫ్గానిస్థాన్‌ను ఓడించి ఇంగ్లండ్ టైటిల్ ఫైట్‌కు రెడీ అయింది

మ్యాచ్ ఎన్నిగంటలకంటే..?
భారత్‌కు వరుసగా ఇది నాలుగో ఫైనల్ కాగా.. గత టోర్నీలో బంగ్లాదేశ్ చేతిలో ఓడి తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. మరోవైపు ఇంగ్లండ్ మాత్రం 1998 తర్వాత తొలిసారి ఫైనల్‌కు చేరింది. 24 ఏళ్ల క్రితం టైటిల్ గెలిచిన ఆ జట్టు మళ్లీ ఇప్పటి వరకు చాంపియన్ కాలేకపోయింది. కనీసం ఫైనల్ కూడా చేరలేదు. ఈ సారి సూపర్ పెర్ఫామెన్స్‌తో ఫైనల్‌కు వచ్చిన ఆ జట్టు టైటిల్ గెలిచి 24 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

ఎలా చూడాలంటే..?
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌లో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1, 2తో పాటు తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం చానెల్స్‌లో కూడా వీక్షించవచ్చు. ఆన్‌లైన్ స్ట్రీమ్ వేదికగా చూడాలంటే మాత్రం డీస్నీ హాట్‌స్టార్‌లో చూడవచ్చు. అయితే హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటేనే మ్యాచ్‌ను వీక్షించివచ్చు.

పిచ్, వెదర్ రిపోర్ట్..
ఈ మెగా ఫైనల్‌కు వర్ష సూచన ఉంది. 40 శాతం వర్షం వచ్చే అవకాశాలున్నాయని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏ సమయంలోనైనా వర్షం రావచ్చని, కొద్దీసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చని హెచ్చరించింది. సర్ వివియన్ రిచర్డ్స్ మైదానంలో ఆండీ రోబర్ట్స్, కర్ట్‌లీ ఆంబ్రోస్ రెండు బౌలింగ్ ఎండ్స్ ఉన్నాయి. ఈ మైదాన పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ వేదికలో యావరేజ్ స్కోర్ 239. ఔట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుంది. అత్యధిక స్కోర్ మాత్రం 322/6.

తుది జట్లు (అంచనా)
భారత్: రఘు వంశీ, హర్నూర్ సింగ్, షేక్ రషీద్, యశ్ ధుల్(కెప్టెన్), రాజవర్థన్ హంగార్గేకర్, నిషాంత్ సింధు, దినేశ్ బనా(కీపర్), కౌశల్ తాంబే, రాజ్ బావ, విక్కీ ఒస్వాల్, రవికుమార్
ఇంగ్లండ్ : జార్జ్ థామస్, జకోబ్ బెతెల్, టామ్ ప్రెస్ట్(కెప్టెన్), జేమ్స్ రూ, విలియమ్ లక్స్టన్, జార్జ్ బెల్, అలెక్స్ హోర్టన్, జేమ్స్ సేల్స్, థోమస్ అస్పిన్ వాల్, జోషువా బైడెన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications