Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై టెస్టుకు దూరం: అంఫైర్ తలను తాకిన బంతి

హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలిరోజు బంతి తగిలి గాయపడిన ఫీల్డ్ అంపైర్ పాల్ రైఫెల్‌కి ముంబై టెస్టు నుంచి విశ్రాంతిని కల్పిస్తున్నట్లు ఐసీసీ శుక్రవారం (డిసెంబర్ 9)నాడు అధికారిక ప్రకటన చేసింది.

వివరాల్లోకి వెళితే భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడె స్టేడియంలో గురువారం నాలుగో టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ వేశాడు.

ఫోటోలు: ముంబై టెస్టులో బంతి తగిలి అంఫైర్ 'రిటైర్డ్ హర్ట్'

అశ్విన్ ఓవర్‌లో బంతిని ఇంగ్లాండ్ ఆటగాడు జెన్నింగ్స్ లెగ్‌స్టంప్‌ వైపు పంపంచి సింగిల్‌ తీశాడు. ఈ క్రమంలో ఫీల్డర్ భువనేశ్వర్ కుమార్ బంతిని అందుకుని నేరుగా త్రో విసిరాడు. ఆ బంతి అంఫైర్ పాల్ రైఫిల్‌ తలకు వెనుక బాగాన తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

India Vs England: Umpire Paul Reiffel not to take further part inMumbai Test

అనంతరం ఫిజియో అతనికి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆయన ఫీల్డ్‌ను వదిలి వెళ్లిపోయాడు. అతని స్ధానంలో టీవీ అంపైర్ దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్‌ ఇరాస్‌ముస్‌ ఫీల్డ్ అంపైర్‌ బాధ్యతలు చేపట్టారు. పాల్‌కు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శనివారం అధికారిక ప్రకటన చేసింది. శుక్రవారం గాయపడిన పాల్ రైఫిల్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, అయితే అతని ముంబై టెస్టు నుంచి తప్పించినట్లు పేర్కొంది. వైద్యులు సూచన మేరకు అతడికి విశ్రాంతిని కల్పించినట్లు అందులో వెల్లడించింది.

ముంబై టెస్టులో ఇకపై అతడి స్ధానంలో దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్‌ ఇరాస్‌ముస్‌ ఫీల్డ్ అంపైర్‌‌గా వ్యవహారిస్తాడని ఐసీసీ పేర్కొంది. తొలిరోజైన శుక్రవారం లంచ్ విరామం తర్వాత ఈ సంఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+