ఫోటోలు: ముంబై టెస్టులో బంతి తగిలి అంఫైర్ 'రిటైర్డ్ హర్ట్'
హైదరాబాద్: ముంబై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో అనుకోకుండా ఓ సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్న పాల్ రైఫెల్ తలకు బంతి తగలడంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.
తొలి రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ వేశాడు. అశ్విన్ ఓవర్‌లో బంతిని ఇంగ్లాండ్ ఆటగాడు జెన్నింగ్స్ లెగ్‌స్టంప్ వైపు పంపంచి సింగిల్ తీశాడు. ఈ క్రమంలో ఫీల్డర్ భువనేశ్వర్ కుమార్ బంతిని అందుకుని నేరుగా త్రో విసిరాడు.

అంఫైర్ తలకు వెనుక బాగాన తలిగిన బంతి
ఆ బంతి అంఫైర్ తలకు వెనుక బాగాన తగిలింది. దీంతో మైదానంలో ఫీల్డ్ అంఫైర్‌గా ఉన్న ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం ఫిజియో అతనికి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఫీల్డ్‌ను వదిలి వెళ్లిపోయాడు. పాల్‌కు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు.

అతని స్ధానంలో ఫీల్డ్ అంపైర్‌గా మరైస్ ఇరాస్‌ముస్
అతని స్ధానంలో టీవీ అంపైర్ దక్షిణాఫ్రికాకు చెందిన మరైస్ ఇరాస్‌ముస్ ఫీల్డ్ అంపైర్ బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టులో నిలకడగా ఆడుతోంది. అలెస్టర్ కుక్(46), జో రూట్(21)లను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుని ఈ టెస్టులో అరంగేట్రం చేసిన జెన్నింగ్స్ ఆదుకున్నాడు.

పలు రికార్డులకు వేదికైన నాలుగో టెస్టు
దీంతో నాలుగో టెస్టు మ్యాచ్ పలు రికార్డులకు వేదికైంది. అరంగేట్రం చేసిన తొలి టెస్టులోనే ఇంగ్లాండ్ ఓపెనర్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 89బంతులకే అర్థ సెంచరీని పూర్తి చేసుకున్న జెన్నింగ్స్ 186 బంతుల్లో సెంచరీ సాధించాడు.

19వ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌గా జెన్నింగ్స్ చరిత్ర
అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేసిన 19వ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌గా జెన్నింగ్స్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు వాంఖడె స్టేడియంలో అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 2006లో ఇంగ్లండ్ ఆటగాడు ఓవై షా ఇక్కడ చేసిన 88 పరుగులే ముంబైలో ఇప్పటి వరకు అరంగేట్ర బ్యాట్స్‌మెన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications