
బర్నాల్ రాసుకో..
ఇంగ్లండ్‌పై భారత్ ఆధిపత్యం చూస్తుంటే మైకేల్ వాన్‌కు ఎక్కడో కాలుతుందని, బర్నాల్ రాసుకోవాలని సూచిస్తూ కామెంట్ చేస్తున్నారు. ఇరు జట్లు ఒకే వికెట్‌పై ఆడాయని, ఇంగ్లండ్‌లో కూడా స్పిన్నర్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. స్పిన్ ట్రాక్‌పైనే రోహిత్ శర్మ భారీ సెంచరీ చేశాడని, ఏడో స్థానంలో వచ్చిన అశ్విన్ కూడా శతకం సాధించాడని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా పంత్, విరాట్ కోహ్లీలు హాఫ్ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారని తెలిపాడు. పిచ్ బాగాలేదని ఫస్ట్ మ్యాచ్ అప్పుడు ఎందుకనలేదని నిలదీస్తున్నారు. భారత్ విజయంతో మైకేల్ వాన్ పరిస్థితి ఇలా ఉందంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు.

షేన్ వార్న్ కౌంటర్..
ఇక పిచ్‌పై కామెంట్ చేసిన మైకేల్ వాన్‌కు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా కౌంటరించ్చాడు. 'మొదటి టెస్టులో ఇండియా గెలవడానికి ఎటువంటి అవకాశం లేనప్పుడు.. పిచ్ గురించి ఏ ఒక్కరూ మాట్లాడరు. గత కొద్ది రోజుల క్రితమే ఇదే పిచ్‌పై తొలి టెస్టు జరిగింది. అప్పుడు ఇప్పుడు ఇరు జట్లకు ఒకే రకమైన పరిస్థితులు ఉన్నాయి.
ప్రస్తుతం ఇంగ్లండ్ బౌలింగ్ పేలవంగా ఉంది. రోహిత్, పంత్, జింక్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. రెండో టెస్టుతో పోల్చితే మొదటి టెస్టులో టాస్ కీలకమైంది అంతే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ కంటే భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. 220 పరుగులకు ఆతిథ్య జట్టును కట్టడి చేయాలి. స్పిన్, సీమింగ్ మధ్య తేడా ఏమీ లేదు. ఈ పిచ్‌పై బ్యాటింగ్ ఎలా చేయాలన్న దానికి రోహిత్ ఇన్నింగ్సే ఉదహరణ "అని వార్న్ వరుసగా ట్వీట్లు చేశాడు.
రోహిత్ శర్మ ఎలా? ఆడాడు?
పిచ్‌ను విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. "రోహిత్ ఇన్నింగ్స్ చూస్తే పిచ్ అంత ప్రమాదకరంగా ఏమీ లేదని స్పష్టమవుతోంది. పిచ్ అలా ఉంటే ఓ జట్టు 330 పరుగులు చేయగలదా? పిచ్ బ్యాటింగ్ చేయలేని విధంగా ఏమీ లేదు. కానీ బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసురుతోంది. క్రికెట్ అంటే అలాగే ఉండాలి. తొలి టెస్టు తొలి రెండు రోజుల్లో బ్యాటింగ్ మరీ తేలిగ్గా ఉందన్నారు. ఇప్పుడు బంతికి, బ్యాటుకు సమతూకం ఉండేలా చూస్తే పిచ్ గురించి ఫిర్యాదులు చేస్తున్నారు" అన్నాడు. అసలు ఇప్పుడు చర్చ జరగాల్సింది పిచ్ గురించి కాదని.. ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఎలాంటి నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారన్న దానిపై అని సన్నీ స్పష్టం చేశాడు.
అద్భుత విజయం..
సెకండ్ టెస్ట్‌లో భారత్ అద్భుత విజయాన్నందుకుంది. అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో భారీ ఓటమి చవిచూసింది. 482 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో విజృంభించిన.. అక్షర్ (5/60), అశ్విన్ (3/53) మరోసారి చెలరేగారు. దీంతో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 53/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు మంగళవారం ఆట మొదలెట్టిన ఇంగ్లండ్ మరో 111 పరుగులు చేసి చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. కుల్దీప్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి.


Click it and Unblock the Notifications












