
స్పెషల్ డిస్కౌంట్..
ఈ నేపథ్యంలోనే మహ్మద్ కైఫ్.. అశ్విన్ పెర్ఫామెన్స్‌ను కొనియాడుతూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. 'స్పిన్-ఫ్రెండ్లీ పిచ్‌లపై బ్యాటింగ్, బౌలింగ్‌లో క్రాష్ కోర్సు కావాలా? అయితే అశ్విన్ సర్‌ను కలవండి. ఈ ట్యుటోరియల్స్ తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. భారత్-ఇంగ్లండ్ సిరీస్ తర్వాత కొత్త బ్యాచ్ ప్రారంభమవుతోంది. ఎలాంటి సాకులు లేకుండా మెళుకవలు నేర్చుకోవాలనుకునేవారికి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది.'అని ట్వీట్ చేశాడు. విభిన్నంగా ఉన్న ఈ ట్వీట్ ప్రస్తుతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక అశ్విన్ సతమణి కూడా తన భర్త సెంచరీపై ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. అశ్విన్ అందర్నీ ట్రోల్ చేస్తున్నాడని పేర్కొంది.

సెల్యూట్ అశ్విన్..
అశ్విన్ అద్భుత బ్యాటింగ్‌పై దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సహా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'కంఫర్ట్ జోన్‌లో ఉండాలనుకుంటే గొప్ప పనులు సాధ్యం కావు. ఈ పిచ్ కఠినమైందే తప్ప అసాధ్యమైనది కాదని తన హార్డ్ హిట్టింగ్‌తో అశ్విన్ నిరూపించాడు. ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడిన యాశ్‌కు చేతులెత్తి నమస్కరించడం కంటే ఇంకేం చేయగలను'' అని లక్ష్మణ్ కొనియాడాడు. ఇక మైకేల్ వాన్ స్పందిస్తూ.. హై క్లాస్ ఆట అంటూ అశ్విన్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. కాస్తైనా కనికరం లేకుండా ఇంగ్లండ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడని, టీమిండియాలో ఇలాంటి నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు కొదవే లేదని పేర్కొన్నాడు.

ఆ సందేహాలన్నీ..
ఇక దినేశ్ కార్తిక్ సైతం.. ''ప్రపంచం మొత్తం చెత్త వికెట్ అని మాట్లాడుకుంటున్న తరుణంలో, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్ సెంచరీ చేశాడు. విశ్లేషకుల మెదళ్లలో ఉన్న అనేకానేక సందేహాలకు అతని అసాధారణ బ్యాటింగ్ సమాధానం అవుతుందని ఆశిస్తున్నా. సరైన ప్రణాళిక, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే చెన్నై వికెట్‌పై తమను తాము నిరూపించుకునే గొప్ప అవకాశం వస్తుంది'' అంటూ అశ్విన్‌ను కొనియాడాడు. 33 ఓవర్లు బౌలింగ్ చేసి.. బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు అండగా నిలవడం గొప్ప విషయమని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు.
అశ్విన్ ఆల్‌రౌండ్ షో..
రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్‌లో టీమిండియా విజయానికి చేరువైంది. 482 పరుగుల భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ రెండు వికెట్ల తీయగా లోకల్ బాయ్ అశ్విన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. క్రీజులో జో రూట్ ( 2 బ్యాటింగ్), లారెన్స్ (19 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు 52/1 స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్(148 బంతుల్లో 14 ఫోర్లు ఒక సిక్స్‌తో 106) వీరోచిత సెంచరీకి తోడు విరాట్ కోహ్లీ(149 బంతుల్లో 7 ఫోర్లతో 62) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. చివర్లో సిరాజ్(16 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.


Click it and Unblock the Notifications
