For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సారీ సూర్య.. పాపం పంత్.. గుడ్‌బై రాహుల్.. భారత్ ఇన్నింగ్స్‌పై పేలుతున్న జోక్స్, మీమ్స్!

 India vs England: Twitter bemused with Virat Kohli after Rishabh Pant gets run-out
IND vs ENG : KL Rahul T20I Ducks | Twitter Bemused With Kohli For Rishabh Pant Run Out || Oneindia

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో మొతేరా మైదానం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్ ) మోత మోగించాడు. తన కళాత్మకమైన బ్యాటింగ్‌‌తో ఇంగ్లండ్‌ పేసర్ల వేగాన్ని తనకు అనుగుణంగా మలుచుకున్నాడు. మణికట్టును ఉపయోగిస్తూ అందం ఉట్టి పడే బౌండరీలు.. కళ్లుచెదిరే సిక్సర్లు బాదేశాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. అయితే విశ్రాంతి ముగియడంతో ఈ మ్యాచ్‌‌తో ఓపెనర్ రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వగా.. సూర్య‌కుమార్ యాదవ్ చోటు కోల్పోయాడు. దీంతో నెటిజన్లు సూర్య పట్ల ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు.

సారీ సూర్య..

టీమ్‌మేనేజ్‌మెంట్ సూర్యపై వేటు వేయాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు. తొలి రెండు టీ20ల్లో దారుణంగా విఫలైన కేఎల్ రాహుల్‌కు మరో అవకాశం ఇచ్చిన టీమ్‌మేనేజ్‌మెంట్.. సూర్యను తప్పించి ఇషాన్ కిషన్‌ను మూడో స్థానంలో పంపించింది. అయితే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత గత మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సూర్య.. కనీసం బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాకుండానే జట్టులో చోటు కోల్పోయాడు. దాంతో ఈ ముంబై క్రికెటర్ పట్ల అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో అతనికి అవకాశం లభిస్తుందని ట్వీట్ చేస్తూ అండగా నిలుస్తున్నారు.

గుడ్‌బై రాహుల్..

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ మళ్లీ డకౌటయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో తడబడిన కేఎల్ రాహుల్ (0: 4 బంతుల్లో) క్లీన్ బౌల్డయ్యాడు. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ డకౌటవడం ఇది రెండో సారికాగా.. మూడు మ్యాచ్‌ల్లో కలిపి అతను కేవలం ఒకే ఒక పరుగు మాత్రమే చేయడం గమనార్హం.

దాంతో అతనిపై అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ టీ20 సిరీస్‌కి ముందు ఆస్ట్రేలియా‌తో గత ఏడాది తాను ఆడిన చివరి టీ20లోనూ కేఎల్ రాహుల్ డకౌట్‌గా వెనుదిరగాడు. దాంతో.. రాహుల్ చివరి 4 టీ20 మ్యాచ్‌ల్లో చేసిన పరుగులు వరుసగా.. 0, 1, 0, 0 మాత్రమే. దాంతో గుడ్‌బై రాహుల్, టాటా, బైబై అనే మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు.

కోహ్లీ అవసరమా..?

తాజా మ్యాచ్‌లో 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. అయితే విరాట్ కోహ్లీ అత్యుత్సాహం కారణంగా రిషభ్ పంత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. లేని పరుగు కోసం ప్రయత్నించగా.. కెప్టెన్ మాట కాదనలేకపోయిన పంత్ మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో విరాట్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పరుగు తీయాల్సిన పనిలేదని, అంత అత్యుత్సాహం అక్కర్లేదని విరాట్‌ను అభిమానులు చివాట్లు పెడుతున్నారు.

Story first published: Tuesday, March 16, 2021, 22:17 [IST]
Other articles published on Mar 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+