For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్‌దే ఆధిపత్యం

India vs England: Team India take complete control of 2nd Test

చెన్నై: ఊహించినట్లుగానే స్పిన్‌కు అనకూలంగా ఉన్న పిచ్‌పై భారత బౌలర్లు సమష్టిగా చెలరేగారు. వారికి తోడు ఇతర ఆటగాళ్లు కూడా సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టడంతో సెకండ్ టెస్ట్ రెండో రోజు ఆటలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థిని 134 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసి 195 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకొంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో బెన్ ఫోక్స్ (42 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్‌(5/43)కు అండగా అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 18 ఓవర్లలో 54 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(62 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25 బ్యాటింగ్), పుజారా( 18 బంతుల్లో 1 ఫోర్‌తో 7 బ్యాటింగ్) ఉన్నారు. జాక్ లీచ్‌కు ఓ వికెట్ దక్కింది.

 భారత్ 339 ఆలౌట్..

భారత్ 339 ఆలౌట్..

అంతకు ముందు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. 300/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 29 పరుగుల వ్యవధిలోనే మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు డాషింగ్ హిట్టర్ రిషభ్ పంత్(77 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్‌లతో 58 నాటౌట్) ధాటిగా ఆడినా.. మరోవైపు ఓలిస్టోన్(3/47) దెబ్బకు టెయిలండర్లు నిలబడలేకపోయారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ అక్సర్ పటేల్(5) మొయిన్ అలీ ఒక్క పరుగు కూడా చేయకుండా స్టంపౌటవ్వగా.. బంతి వ్యవధిలోనే ఇషాంత్ శర్మ(0) కూడా ఔటయ్యాడు. దాంతో ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకునే ప్రయత్నం చేసిన పంత్..ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ స్టోన్.. ఒకే ఓవర్‌లో కుల్దీప్ యాదవ్‌(0), మహ్మద్ సిరాజ్(0)‌లను కీపర్ క్యాచ్‌లుగా పెవిలియన్ చేర్చడం‌తో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

 ఇషాంత్ దెబ్బ..

ఇషాంత్ దెబ్బ..

అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఖాతా తెరవకుండానే ఓపెనర్ రోరీ బర్న్స్(0) వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే బర్న్స్ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత అశ్విన్.. మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(16) క్యాచ్‌ఔట్‌ చేయగా.. అరంగేట్ర ఆటగాడు అక్షర్ పటేల్ ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్(6)ను పెవిలియన్‌కు చేర్చాడు. స్వీప్ షాట్లు అలవోకగా ఆడే జోరూట్‌ను ఆ ఉచ్చులోనే బిగించాడు. 10 ఓవర్‌లో అతను వేసిన డ్రై‌ లెంగ్త్ బాల్‌ను స్వీప్ షాట్ ఆడిన జోరూట్(6).. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న అశ్విన్‌కు చిక్కాడు. ఆ తర్వాత డాన్ లారెన్స్(9)ను అశ్విన్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 39/4తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

 రిషభ్ పంత్ సూపర్ క్యాచ్..

రిషభ్ పంత్ సూపర్ క్యాచ్..

అనంతరం బెన్ స్టోక్స్(9)‌ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసిన ఓలి పోప్(22)ను రిషభ్ పంత్ సూపర్ క్యాచ్ సాయంతో సిరాజ్ పెవిలియన్‌కు చేర్చాడు. స్వదేశంలో ఫస్ట్ టెస్ట్ ఆడుతున్న సిరాజ్.. తన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే వికెట్ తీశాడు. లెగ్ స్టంప్‌ దిశగా వేసిన బాల్‌ను ఓలీపోప్ థర్డ్ మ్యాన్ దిశగా ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచిన బంతిని రిషభ్ సూపర్ మ్యాన్‌లా ఎగిరి ఒంటిచేత్తో అందుకున్నాడు.

కొద్దిసేపటికే మొయిల్ అలీ(6) రహానే సూపర్ క్యాచ్‌లో అక్షర్ ఔట్ చేశాడు. ఆ వెంటనే ఓలి స్టోన్‌ను అశ్విన్ పెవిలియన్‌కు చేర్చడంతో ఇంగ్లండ్ 106/8తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

అశ్విన్ పాంచ్ పటాకా..

అశ్విన్ పాంచ్ పటాకా..

బ్రేక్ అనంతరం 10 ఓవర్ల వ్యవధిలోనే ఇంగ్లండ్ ఆలౌటైంది. రిషభ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్‌తో జాక్ లీచ్‌(5)ను ఇషాంత్ పెవిలియన్ చేర్చగా.. స్టువర్ట్ బ్రాడ్‌(0)ను అశ్విన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ వికెట్‌తో అశ్విన్ 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 29 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. శుభ్‌మన్ గిల్(14) మరోసారి నిరాశపరిచాడు. జాక్ లీచ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్న ఫలితం లేకపోయింది.

Story first published: Sunday, February 14, 2021, 17:08 [IST]
Other articles published on Feb 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+