Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి టీమిండియా.. రేసులో అక్షర్, సుందర్!‌ రిజర్వ్ బెంచ్‌కే హార్దిక్!

India vs England: Team India likely to play with Three Spinners in First Test

చెన్నై: ఇంగ్లాండ్‌తో భారత జట్టు ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ఇంకో రెండు రోజులే సమయం ఉంది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి టెస్టు సిరీస్‌ గెలిచిన ఉత్సాహంతో ఇంగ్లాండ్‌ పోరును ఆరంభించనుంది కోహ్లీసేన. కంగారూ గడ్డపై అద్భుత విజయంలో బౌలర్ల పాత్ర ఎంతో కీలకం. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను గెలవాలన్నా.. ప్రతి మ్యాచ్‌లో 20 వికెట్లు తీయడం తప్పనిసరి. అయితే తుది జట్టు ఎంపికలో, ముఖ్యంగా బౌలింగ్‌ దళంలో ఎవరుండాలనే విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పి తప్పేట్లు లేదు. తొలి టెస్టుకి ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి టీమిండియా

ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి టీమిండియా

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల కాంబినేషన్‌తో మ్యాచ్‌లు ఆడిన టీమిండియా చెపాక్ పిచ్ స్పిన్నర్లకి అనుకూలించనుండటతో కాంబినేషన్‌ని మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కుడిచేతి వాటం ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఎడమచేతి వాటం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మూడో స్పిన్నర్ రేసులో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నట్లు సమాచారం. శ్రీలంక పర్యటనలో ఎడమచేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఇబ్బందిపడిన విషయం తెలిసిందే.

ఇషాంత్, సిరాజ్ మధ్య పోటీ

ఇషాంత్, సిరాజ్ మధ్య పోటీ

పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా ఆడటం ఖాయమవగా.. రెండో పేసర్ బెర్తు కోసం ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ మధ్య పోటీ నెలకొంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. కానీ గాయం నుంచి ఇటీవల కోలుకున్న ఇషాంత్ అనుభవాన్ని వినియోగించుకోవాలని టీమిండియా ఆశిస్తోంది. తుది జట్టులో ముగ్గురు పేసర్లుండాలనుకుంటే ఇద్దరికీ చోటుంటుంది. పేసర్లు ఇద్దరే అయితే ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరం. అనుభవం ప్రకారం చూస్తే ఇషాంత్‌కే ఓటేయాలి. అయితే అతను ఫిట్‌నెస్‌ సమస్యలతో చాలా కాలం ఆటకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అత్యుత్తమ స్థాయిలో బౌలింగ్‌ చేయగలడా అన్నది ప్రశ్న.

రిజర్వ్ బెంచ్‌కే హార్దిక్

రిజర్వ్ బెంచ్‌కే హార్దిక్

పేస్‌తో పాటు స్పిన్‌కు సమానంగా సహకరించేలా చెపాక్‌ పిచ్‌ తయారవుతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. మరి బౌలింగ్‌ దళం విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ఎంపిక ఎలా ఉంటుందో? చూడాలి. ఇక ఆరుగురు బ్యాట్స్‌మెన్ (రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్) కాంబినేషన్‌‌ని కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగిస్తే.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

తొలి టెస్టుకి భారత్ తుది జట్టు (అంచనా)

తొలి టెస్టుకి భారత్ తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్/అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ/మహ్మద్ సిరాజ్.

ISL 2020 21: ఈస్ట్ బెంగాల్‌పై బెంగళూరు విజయం!!

Story first published: Wednesday, February 3, 2021, 11:41 [IST]
Other articles published on Feb 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+