Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: పుణె చేరుకున్న టీమిండియా! (వీడియో)

India vs England: Team India Arrive In Pune For ODI Series Against England

పుణె: ఇంగ్లండ్‌పై వరుసగా టెస్ట్, టీ20 సిరీస్‌లు గెలిచి జోష్‌లో ఉన్న టీమిండియా తదుపరి అసైన్‌మెంట్‌పై దృష్టి పెట్టింది. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఆదివారం సాయంత్రం పుణె చేరుకుంది. దాదాపు నెల రోజులుగా అహ్మదాబాద్‌లో ఉన్న కోహ్లీ సేన.. చార్టెడ్ ఫ్లైట్‌లో పుణె వచ్చింది. ఇరు జట్ల మధ్య ఇదే వేదికపై తొలి వన్డే మంగళవారం జరగనుంది. రెండు, మూడు వన్డేలు వరుసగా 26, 28 తేదీల్లో జరుగుతాయి. పేసర్ ప్రసీద్ కృష్ణతో పాటు సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన టీమ్‌లో కొత్తగా చోటు దక్కించుకున్నారు.

ఈ వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్‌ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. మోచేతి గాయానికి గురైన పేస్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ జట్టుకు దూరమయ్యాడు. అతన్ని స్వదేశానికి రప్పిస్తున్నట్లు ఈసీబీ తప ప్రకటనలో పేర్కొంది. టీ20 సిరీస్‌లో ఆడిన జాక్ బాల్, డేవిడ్ మలాన్, క్రిస్ జోర్డాన్‌ను వన్డే సిరీస్‌కు బ్యాకప్‌గా తీసుకున్నారు. ఈ ముగ్గురు జట్టుతో పాటే కొనసాగనున్నారు.

ఇంగ్లండ్‌ జట్టు: ఇయాన్ మోర్గాన్‌(కెప్టెన్), మొయిన్‌ అలీ, బెయిర్‌ స్టో, సామ్ బిల్లింగ్స్‌, జోస్ బట్లర్‌, సామ్‌ కరన్‌, టామ్‌ కరన్‌, లివింగ్‌స్టోన్‌, మ్యాట్‌ పార్కిన్సన్‌, అదిల్‌ రషీద్‌, జాసన్‌ రాయ్‌, స్టోక్స్‌, టోప్లే, మార్క్‌ వుడ్‌.

Story first published: Monday, March 22, 2021, 9:41 [IST]
Other articles published on Mar 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+