భారత్ X ఇంగ్లండ్ టీ20 సిరీస్.. ఎలా చూడాలంటే? షెడ్యూల్, టైమింగ్స్..?
ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఆ జట్టుతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. బుధవారం నాటింగ్‌హామ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా.. హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 2-0తో ఊహించని పరాజయం చవిచూసిన భారత్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది.
మరోవైపే, ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లో వాంఖడే స్టేడియం వేదికగా భారత్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓటమి పాలైన ఇంగ్లండ్ జట్టు ఆ తర్వాత మరే టీ20 మ్యాచ్ ఆడలేదు. స్వదేశంలో జరగబోయే ఈ సిరీస్‌ను గెలుచుకుని ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఈ సిరీస్ గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటుంది.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌ల షెడ్యూల్
ఈ టీ20 సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌లు వేర్వేరు స్టేడియాల్లో జరగనున్నాయి. జూలై 1(బుధవారం)న చెస్టర్-లే-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ మైదానంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో, మిగిలిన మూడు మ్యాచ్‌లు వరుసగా నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్, బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్, సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానాల్లో జరగనున్నాయి. తొలి, మూడు, నాలుగో టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 10:00 గంటలకు, రెండు , ఐదో మ్యాచ్‌లు సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతాయి.

ఏ ఛానెల్‌లో చూడాలంటే..?
ఈ సిరీస్‌కు సోనీ నెట్‌వర్క్‌తో పాటు జియోహాట్‌స్టార్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్నాయి. టీవీలో సోనీ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో.. జియో హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఉండనుంది.
ఇరు జట్ల వివరాలు
భారత్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, శివం దూబే ,
ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్(కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జేమ్స్ కోల్, జోర్డాన్ కాక్స్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, జోష్ టంగ, ల్యూక్ వుడ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

