For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెన్నై వేదికగా ఆడే చాన్స్ మిస్సవ్వడం బాధగా ఉంది.. బయోపిక్‌‌పై ఆసక్తి లేదు: నటరాజన్

 India vs England: T Natarajan says Definitely missing being part of squad
T Natarajan Biopic: T Natarajan Disappointed To Miss England Tests At Home Ground | India vs England

చెన్నై: ఇంగ్లండ్‌తో చెన్నై వేదికగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌లకు దూరం కావడం బాధగా ఉందని టీమిండియా యువ పేసర్ టీ నటరాజన్ అన్నాడు. కొన్ని నెలలపాట జట్టుతో ఉండి, ఇప్పుడు దూరంగా ఉండటం ఏదో కోల్పోయిన భావనను కలిగిస్తుందన్నాడు. ఇక తన బయోపిక్‌ను తెరకెక్కించేందుకు చాలా మంది దర్శకులు ముందుకు వచ్చారని, కానీ ప్రస్తుతం తన దృష్టాంతా టీమిండియాకు ఆడటంపైనే ఉందని ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ తెలిపాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా అవకాశాలందుకున్న ఈ తమిళనాడు క్రికెటర్ మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. నెట్‌బౌలర్‌గా జట్టులో చేరి తనదైన ఆటతీరుతో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే గత 6 నెలలుగా విరామం లేకుండా ఆడుతున్న నట్టూని టీమిండియా మేనేజ్‌మెంట్ ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్ నుంచి తప్పించి విశ్రాంతినిచ్చింది.

చెన్నైలో ఆడే అవకాశం..

చెన్నైలో ఆడే అవకాశం..

ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉన్న నట్టూ.. ఈ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నాడు. అయితే చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లకు దూరమవ్వడం బాధగా ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ యార్కర్ల నట్టూ పేర్కొన్నాడు. 'గత కొన్ని నెలలుగా జట్టుతోనే ఉండి ఇప్పుడు దూరంగా ఉండటం బాధగానే ఉంది. కానీ విశ్రాంతి తీసుకోవడం ఎంత ముఖ్యమో నేను అర్థం చేసుకోగలను. గత 6 నెలలుగా నేను మా కుటుంబానికి దూరంగా ఉన్నాను. దాంతో ఈ విశ్రాంతి పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. కానీ చెన్నై వేదికగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు జట్టుతో లేననే బాధే నన్ను వెంటాడుతుంది.'అని నటరాజన్ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా ఇంగ్లండ్-భారత్ ఫస్ట్ టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రెండో టెస్ట్ కూడా ఇక్కడే జరగనుంది.

 మూడు ఫార్మాట్లలో ఆడాలని..

మూడు ఫార్మాట్లలో ఆడాలని..

ఇక మూడు ఫార్మాట్లలో ఆడటంపైనే తాను దృష్టిసారించానని నట్టూ తెలిపాడు. దానికి అనుగుణంగా కసరత్తులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 'వర్క్‌లోడ్‌ను మెయింటేన్ చేస్తూ మూడు ఫార్మాట్లలో రాణించాలనుకుంటున్నా. అందుకనుగుణంగా నా ఫిట్‌నెస్, బౌలింగ్ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడంపై దృష్టిసారించా. నా జీవితంలో వరుసగా ఆరు నెలలు ఆడటం ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌లో నా ట్రైనింగ్‌ను కొనసాగించడం వల్లనే నేను ఐపీఎల్, ఆస్ట్రేలియా పర్యటన వర్క్‌లోడ్‌ను సమన్వయం చేసుకోగలిగాను.'అని తెలిపాడు.

 ఓపికను పెంచుకోమన్నారు..

ఓపికను పెంచుకోమన్నారు..

గత 6 నెలలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతూ ఉండటంతోనే బీసీసీఐ తనకు విశ్రాంతినిచ్చిందని నట్టూ చెప్పుకొచ్చాడు.'సోమవారం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించాను. నా ఫిట్‌నెస్ మెరుగుపరచుకోవడానికి కసరత్తులు చేస్తున్నాను. నేను మూడు ఫార్మాట్లలో రాణించాలంటే ఫిట్‌నెస్‌పై మరింత దృష్టిసారించాలి. నా సీమ్, బౌలింగ్ నైపుణ్యం పట్ల టీమ్‌మేనేజ్‌మెంట్ సంతృప్తికరంగా ఉంది. కాకపోతే ఓపికగా ఉండటాన్ని మెరుగుపరుచుకోమని చెప్పింది. టెస్ట్ క్రికెట్ ఓపికకు అసలు సిసలు పరీక్ష. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతానని బీసీసీఐనీ కోరితో బ్రేక్ తీసుకోమని నిరాకరించింది. దాంతోనే తమిళనాడు తరఫు బరిలోకి దిగలేకపోయాను. ఇక తమ జట్టు సమష్టి ప్రదర్శనతో విజేతగా నిలిచింది.'అని నట్టూ సంతోషం వ్యక్తం చేశాడు.

బయోపిక్ కోసం చర్చలు..

బయోపిక్ కోసం చర్చలు..

తన బయోపిక్‌ను తెరకెక్కిస్తామని చాలా మంది దర్శకులు తనను సంప్రదిస్తున్నారని, కానీ తనకు ప్రస్తుతం ఆసక్తిలేదని నట్టూ తెలిపాడు. ఇప్పుడు తన దృష్టంగా టీమిండియాకు ఆడటంపైనే ఉందన్నాడు. 'చాలా మంది సినీ డైరెక్టర్లు నా బయోపిక్ తెరకెక్కిస్తామని ముందుకు వచ్చారు. నేను లేనప్పుడు కూడా మా ఇంటికి వచ్చి చర్చలు జరిపారు. కానీ ప్రస్తుతం బయోపిక్‌పై నాకు ఆసక్తిలేదు. నా దృష్టంతా భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంపైనే ఉంది.'అని నట్టూ స్పష్టం చేశాడు.

Story first published: Tuesday, February 2, 2021, 14:01 [IST]
Other articles published on Feb 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+