For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: సూర్యకుమార్ యాదవ్, తెవాటియాలకు చాన్స్.. టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే!

India vs England: Suryakumar Yadav, Rahul Tewatia, Ishan Kishan called up to India T20 squad
IND Vs ENG: IPL Fame Uncapped players Suryakumar, Ishan Kishan, Rahul Tewatia Maiden Call For T20I

ముంబై: ఐపీఎల్ స్టార్స్ సూర్య‌కుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, రాహుల్ తెవాటియా తొలిసారి టీమిండియా పిలుపు అందుకున్నారు. మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యారు. అహ్మదాబాద్‌లోని మోతెరా స్డేడియం వేదికగా మార్చి 12-20 తేదీల్లో జరిగే ఈ సిరీస్‌ కోసం 19 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో టీ20 వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది.

ఈ మెగా టోర్నీకి బలమైన జట్టు రెడీ చేసుకునేందుకు సెలెక్టర్లు ఇంగ్లండ్ సిరీస్‌ను ఉపయోగించుకోనున్నారు. దాంతో యూఏఈ వేదికగా జరిగిన గత ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు అవకాశం దక్కింది.

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు చాన్స్...

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు చాన్స్...

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియాలను జట్టులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురికి తొలిసారి భారత జట్టు పిలుపు వచ్చింది. రిషభ్‌ పంత్‌ జట్టులో ఉన్నా, రెండో వికెట్‌ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసిన కమిటీ... సంజు శాంసన్‌పై వేటు వేసింది. బ్యాట్స్‌మన్‌ మనీశ్‌ పాండే, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌, మయాంక్ అగర్వాలను కూడా జట్టు నుంచి తప్పించారు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ మంచి రికార్డున్న సూర్యను ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయకపోవడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

రాహుల్ తెవాటియా..

రాహుల్ తెవాటియా..

గత సీజన్ ఐపీఎల్‌లో యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషాన్ 13 ఇన్నింగ్స్‌ల్లో 516 రన్స్ చేశాడు. ముంబైకే ఆడిన సూర్య 15 ఇన్నింగ్స్‌ల్లో 480 పరుగులు చేశాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన రాహుల్ తెవాటియా 11 ఇన్నింగ్స్‌ల్లో 255 రన్స్ చేశాడు. బౌలింగ్‌లో 10 వికెట్లు తీశాడు. సెలెక్టర్లు తనను పక్కనపెట్టినప్పటికీ సూర్య.. లీగ్‌లో మరింత బాగా పెర్ఫామ్ చేసి ఎట్టకేలకు టీమిండియా పిలుపు అందుకున్నాడు.

వరుణ్ చక్రవర్తికి మరో చాన్స్..

వరుణ్ చక్రవర్తికి మరో చాన్స్..

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకున్న స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి సెలక్టర్లు మరో అవకాశం కల్పించారు. గత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. గాయంనుంచి కోలుకొని భువనేశ్వర్‌ కుమార్‌ పునరాగమనం చేస్తుండగా... ఊహించినట్లుగా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. గాయం నుంచి కోటుకుంటున్న మహ్మద్ షమీని కూడా ఎంపిక చేయలేదు. లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్ ప్లేస్ నిలబెట్టుకోగా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఏడాది తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

జట్టు వివరాలు

జట్టు వివరాలు

విరాట్ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, ఇషాన్‌ కిషన్, యుజ్వేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, టీ నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్‌ చహర్, నవదీప్ సైనీ, శార్దుల్‌ ఠాకూర్

Story first published: Sunday, February 21, 2021, 10:05 [IST]
Other articles published on Feb 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+