For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: 65 రోజుల తర్వాత భార్యని కలిసిన టీమిండియా క్రికెటర్.. ఆ ఆనందంలో ఏం చేశాడంటే?

India vs England: Suryakumar Yadav meets his wife Devisha Shetty after 65 days in London
Suryakumar Ashok Yadav is an Indian International cricketer | Oneindia Telugu

లండన్: టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్టార్ సూర్యకుమార్‌ యాదవ్‌ ఎట్టకేలకు తన సతీమణి దేవిషా శెట్టిని కలుసుకున్నాడు. దాదాపు 65 రోజుల తర్వాత సతీమణిని కలవడంతో సూర్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ముంబై బ్యాట్స్‌మన్‌ తన భార్యతో కలిసి లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఈ సందర్భంగా వారిద్దరూ డ్యాన్స్‌ చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఆ వీడియోను సూర్యకుమార్‌ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

వరుస క్వారంటైన్‌లు

వరుస క్వారంటైన్‌లు

గతనెల శ్రీలంక పర్యటనకు ఎంపికైన సూర్యకుమార్‌ యాదవ్.. మే నెలలోనే ముంబైలోని ఓ స్టార్‌ హోటల్లో రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. లంక పర్యటనలో పలువురు భారత ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో మరోసారి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో చివరి రెండు టీ20లకు అతడు దూరమయ్యాడు. ఆ తర్వాత లంక పర్యటనలోనే ఉన్న సూర్య.. ఇంగ్లండ్‌లో పలువురు ఆటగాళ్లు గాయాలబారిన పడటంతో వారికి రీప్లేస్‌మెంట్‌గా అక్కడికి వెళ్లాడు. అక్కడ కూడా మరోసారి క్వారంటైన్‌ పూర్తిచేశాడు. ఈ క్రమంలోనే దేవిశాకు రెండు నెలల పాటు దూరంగా ఉన్నాడు.

లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతూ

ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్ సతీమణి దేవిషా శెట్టి కూడా లండన్‌కు చేరుకోని, తన క్వారంటైన్‌ గడువును పూర్తి చేసుకుంది. తాజాగా తన భర్తను కలుసుకుంది. ఈ నేపథ్యంలోనే యువ జంట లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతూ నూతనోత్సాహంలో మునిగితేలారు. సూర్యకుమార్‌ 3-4 ఏళ్లుగా ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నా టీమిండియాకు ఇటీవలే ఎంపికయ్యాడు. తొలుత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపికైన సూర్య గతనెల శ్రీలంకలో తొలి అంతర్జాతీయ పర్యటనకు వెళ్లాడు. ఇప్పుడు శుభ్‌మన్‌ గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ స్థానాల్లో పృథ్వీ షాతో కలిసి అనూహ్యంగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు.

సంజనతో కలిసి బుమ్రా

సంజనతో కలిసి బుమ్రా

మరోవైపు ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య, వ్యాఖ్యాత సంజన గణేషన్‌తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో బుమ్రా, సంజనాలు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా పర్యటనలో సంజనా గణేశన్‌తో దిగిన పోటోలను బుమ్రా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫోటోలో ఇద్దరూ ఆనందంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రెండో టెస్ట్ విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ఏం బాధపడకండి.. డ్రామా, సస్పెన్స్‌, క్లైమాక్స్‌ అన్ని ఉన్నాయి! అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది: ధోనీ

అదే జట్టుతో భారత్

అదే జట్టుతో భారత్

ఆగస్టు 25 నుంచి లీడ్స్‌ వేదికగా మూడో టెస్టు జరగనుంది. లీడ్స్‌ టెస్ట్ మ్యాచుకు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మంచి ఫామ్ మీదున్నారు. విమర్శలపాలైన చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు కూడా గాడిలో పడ్డారు. ఇక విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. వీరు కూడా పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ జట్టుకు తిప్పలుతప్పకపోవచ్చు. బౌలింగ్ విభాగంలోనూ భారత్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నారు.

Story first published: Saturday, August 21, 2021, 7:50 [IST]
Other articles published on Aug 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+