ఏం బాధపడకండి.. డ్రామా, సస్పెన్స్, క్లైమాక్స్ అన్ని ఉన్నాయి! అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది: ధోనీ

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచ్‌లకు సమయం దగ్గరపడుతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఆరంభం కానున్నాయి. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అన్ని ఏర్పాట్లు చేసింది. గత సీజన్ మాదిరిగానే దుబాయ్, షార్జా, అబుదాబిలో మ్యాచులు జరుగనున్నాయి. బయోబుడగలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడటంతో మే మొదటి వారంలో ఈ మెగా టోర్నీ వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఎన్నో అవాంతరాల తర్వాత మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది.
ప్రమోషనల్ వీడియో:
యూఏఈలో జరగనున్న ఐపీఎల్ 2021 రెండో భాగం మరో నెల రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ యాజమాన్యం కొద్దిసేపటి క్రితం ఓ ప్రమోషనల్ వీడియోను వదిలింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రమోషనల్ వీడియోలో అదరగొట్టాడు. 'అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని' ఓ బాలీవుడ్ సినిమా డైలాగ్‌తో కూడిన ప్రచార చిత్రంలో సరికొత్త అవతారంలో మహీ కనువిందు చేశాడు. ఆ వీడియోలో పలువురితో కలిసి చెన్నై కెప్టెన్ సందడి చేశాడు.

అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది:
సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే మిగిలిన 14వ సీజన్‌లో.. డ్రామా, సస్పెన్స్, క్లైమాక్స్‌తో పాటు హెలికాఫ్టర్ టేకాఫ్ కూడా ఉంటుందంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రమోషనల్ వీడియోలో పేర్కొన్నాడు. ఏం బాధపడకండి ఇప్పుడే ఇంటర్వెల్ అయింది.. అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది అంటూ మహీ రచ్చ చేశాడు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ షాట్లతో పాటు ప్లే ఆఫ్, సూపర్ ఓవర్లు అన్ని ఉన్నాయని, మరోసారి ఐపీఎల్ 2021ను ఎంజాయ్ చేయండని ధోనీ చెప్పాడు. 'ఐపీఎల్ 2021 వచ్చేస్తుంది. చూడడానికి ఇక సిద్ధంగా ఉండండి' అంటూ ఐపీఎల్ యాజమాన్యం ట్వీట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.

నిరవధిక వాయిదా:
పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో ఐపీఎల్ 2021 మే 4న నిరవధికంగా వాయిదా పడింది. ఈ క్రమంలోనే బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు మళ్లీ సెప్టెంబర్, అక్టోబర్‌లో మిగిలిన సీజన్‌ను పూర్తి చేయాలని భావించారు. దాంతో గతేడాది నిర్వహించిన యూఏఈలోనే ఇప్పుడు కూడా మెగా టీ20 లీగ్‌ను కొనసాగించాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం అన్ని దేశాల బోర్డులతో కూడా మాట్లాడారు. యూఏఈలో జరగనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే కొన్ని జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ మొదలెట్టాయి. మరికొన్ని జట్లు కూడా త్వరలోనే అక్కడికి వెళ్లనున్నాయి.

అగ్రస్థానంలో ఢిల్లీ:
ఇక ఈ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోయేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అందరికన్నా ముందుంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెరో 5 విజయాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ 4 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. దాంతో మిగిలిన సీజన్‌లోనూ ఈ జట్లు ఇలాగే మంచి విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన విషయం తెలిసిందే. ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం ఒకే ఒక్క విజయం అందుకుంది. ప్రస్తుత ఫామ్ చూస్తే.. ఎస్‌ఆర్‌హెచ్ సెమీస్ చేరడం కాస్త కష్టమనే చెప్పాలి. మిగిలిన అన్ని మ్యాచులో గెలిస్తే తప్ప.. ఎస్ఆర్‌హెచ్ జట్టుకు మరో ఆప్షన్ లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications