Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: కేరాఫ్ సూర్య.. ముంబై ఆటగాడి కష్టాలు.!

India vs England: Suryakumar Yadav from distracted hothead to calm run machine

హైదరాబాద్: 'యువతకు సూర్య కుమార్ యాదవ్ ఆదర్శం'.. భారత దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ నోటి నుంచి వచ్చిన మాట! అవును హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మెన్ అన్నట్లు సూర్య నిజంగానే యువతకు ఆదర్శం. అతని సహనానికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. ఐపీఎల్ 13వ సీజన్ నుంచి నిలకడగా రాణిస్తున్న ఈ ముంబై ఆటగాడికి ప్రతీసారి మొండిచెయ్యే ఎదురైంది. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున నిలకడగా రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో మొత్తం 480 పరుగులతో రాణించిన సూర్యకుమార్ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేస్తారని అంతా భావించారు. అతను కూడా ఈసారి పక్కా అవకాశం వస్తుందనే ధీమాతో కనిపించాడు. కానీ అదృష్టం తలుపు తట్టలేదు.

కోహ్లీ వల్లే..

కోహ్లీ వల్లే..

దీంతో అతను చాలా నిరాశకు గురయ్యాడు. సూర్యను ఎంపిక చేయకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. బీసీసీఐ, భారత సెలెక్షన్ కమిటీపై మాజీ క్రికెటర్లు, అభిమానులు దుమ్మెత్తిపోశారు. ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మధ్య చోటు చేసుకున్న వివాదం వల్లే సూర్యపై భారత కెప్టెన్ పగబట్టాడని క్రికెట్ అభిమానులు ఆరోపణలూ గుప్పించారు. అయితే సరైన సమయంలో జాతీయ జట్టులో సూర్యకు అవకాశం లభిస్తుందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అప్పుడే చెప్పాడు.

సూర్య 2.0..

సూర్య 2.0..

2019లో భారత్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌ నాటి సూర్య.. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లోని సూర్యకు చాలా మార్పును గమనించవచ్చు. బరువు ఎక్కువగా ఉండటంతో మైదానంలో సూర్య కాస్త అసౌకర్యంగా కనిపించేవాడు. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. తనకు ఇష్టమైన మిఠాయిలను పూర్తిగా వదిలేశాడు. రైస్, గోధుమ పిండిని 90 శాతం వరకు తగ్గించాడు. కఠినమైన డైట్‌ను ఫాలో అవడం మొదలుపెట్టాడు. హై క్రాబ్ ఫుడ్‌తో పాటు జోవర్, బజ్రా, రాగి రొట్టెలు తినడం, దానికి తోడు పనీల్ పప్పు, కూరగాయలను వాడటం మొదలుపెట్టాడు.

రెండు సెషన్ల వ్యాయామం..

రెండు సెషన్ల వ్యాయామం..

కఠిన డైట్‌తో పాటు ప్రతి రోజూ రెండు దఫాలు వ్యాయామం చేశాడు. అంతకు ముందు వారానికి కేవలం 5 సార్లు మాత్రమే వ్యాయామం చేసే అలవాటున్న సూర్య.. లాక్‌డౌన్ టైమ్‌లో రోజుకు రెండు సార్లు చొప్పున వారానికి 14 సెషన్ల వ్యాయామం చేశాడు. రాత్రి 7.30 గంటలకే భోజనం ముగించి రాత్రి 11లోపు పడుకునేవాడు. అయితే మొదట్లో అతడికి బాగా ఆకలి వేసేదంటా. కానీ రానూరానూ అతను దానికి అలవాటు పడిపోయాడు. ఇంతటి కఠినమైన డైట్ ఫాలో కావడంతో 4 వారాల తర్వాత నుంచి ఫలితాలు రావడం గమనించాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో యూఏఈ వెళ్లేనాటికి అతను పూర్తి ఫిట్‌గా మారిపోయాడు. అతని ఆత్మవిశ్వాసమూ పెరగడంతో లీగ్‌లో బాగా రాణించగలిగినట్లు స్వయంగా సూర్యనే చెప్పాడు.

ఆ రోజు ఏడ్చేశాడంటా..

ఆ రోజు ఏడ్చేశాడంటా..

సూర్య కష్టానికి ఫలితంగా ఇంగ్లండ్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. ఒక జూమ్ కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు సూర్య పక్కన అతని తల్లిదండ్రులు, సోదరి, భార్య ఉన్నారు. అతను టీ20 సిరీస్‌కు ఎంపికయ్యానని తెలియగానే ఒక్కసారిగా ఏడ్చేశాడంటా. ఫోన్ కాల్ మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నట్లు సూర్య చెప్పాడు. టీమిండియా తరఫున ఆడాలన్నది తన జీవిత లక్ష్యమని, ఎట్టకేలకు ఆడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని సూర్య చెప్పాడు. అయితే జట్టులో నెలకొన్ని పోటీ దృష్ట్యా ఆరంభ మ్యాచ్‌ల్లో సూర్యకు అవకాశం దొరకడం కష్టమే. కానీ ఏదో ఒక మ్యాచ్‌లో మాత్రం చాన్స్ రావచ్చు.

Story first published: Friday, March 12, 2021, 10:34 [IST]
Other articles published on Mar 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+