India vs England: సూర్యకుమార్ నిరీక్షణకు తెర.. తొలి మ్యాచ్‌లోనే అరంగేట్రం! బ్యాటు కూడా సిద్ధం!

అహ్మదాబాద్: ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ నిరీక్షణకు తెరపడే సమయం దగ్గరపడిందని తెలుస్తోంది. భారత జట్టుకు ఆడాలనే అతని కోరిక ఈరోజే నెరవేరనుంది. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఈ రోజు రాత్రి జరగబోయే తొలి టీ20లో సూర్యకుమార్ ఆడే అవకాశం ఉంది. తొలి టీ20 సందర్భంగా గురువారం జరిగిన మీడియా సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని బయటకు చెప్పకపోయినా.. సూర్యకుమార్ పరోక్షంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు.

సూర్య అరంగేట్రం చేయబోతున్నాడు:
సాహిల్ ఖాన్ అనే ఫిట్‌నెస్ ట్రైనర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సూర్యకుమార్ యాదవ్ గురించి గురువారం ఓ పోస్ట్ చేశాడు. 'ఇది చాలా పెద్ద వార్త (బిగ్ హంక్ ప్రకటన). సూర్యకుమార్ అంతర్జాతీయ క్రికెట్‌లో రేపు అరంగేట్రం చేయబోతున్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఆడనున్నాడు. టీ20 సిరీస్ ఆడబోతున్న సూర్యకు శుభాకాంక్షలు' అంటూ సాహిల్ పోస్టు పెట్టాడు. దానికి స్పందించిన సూర్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆ పోస్టును పంచుకొని అవునని చెప్పాడు. అంతేకాదు ఓ బ్యాటును కూడా సిద్ధం చేసుకున్నాడు.

అధికారిక ప్రకటన కాదు:
మొత్తానికి ట్వీట్ల ద్వారా ఇంగ్లండ్‌తో ఈరోజు జరిగే తొలి టీ20లోనే ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగి అవకాశం ఉందని అర్థమవుతోంది. అయితే ఇది అధికారిక ప్రకటన కాకపోవడంతో.. చివరి క్షణాల వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ సూర్యకు చోటు దక్కితే.. శ్రేయస్ అయ్యర్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. రోహిత్, రాహుల్, కోహ్లీ, పంత్, హార్దిక్‌లకు స్థానాలు పక్కా కాబట్టి శ్రేయస్ బెంచ్‌కే పర్మితమవ్వాలి.

మూడేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తున్నా:
సూర్యకుమార్ యాదవ్ గత మూడేళ్లుగా అటు దేశవాళి, ఇటు ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్ నుంచి నిలకడగా రాణిస్తున్న ఈ ముంబై ఆటగాడికి ప్రతీసారి మొండిచెయ్యే ఎదురైంది. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ముంబై తరఫున నిలకడగా రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో మొత్తం 480 పరుగులతో రాణించిన సూర్యకుమార్ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అదీ జరగలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన అతడు తర్వాత పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకుసాగాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంగ్లండ్‌తో పొట్టి సిరీస్‌కు ఎంపికయ్యాడు.

ఇంతలో ఎంత మార్పు:
2019లో భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ నాటి సూర్య.. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లోని సూర్యకు చాలా మార్పును గమనించవచ్చు. బరువు ఎక్కువగా ఉండటంతో మైదానంలో సూర్య కాస్త అసౌకర్యంగా కనిపించేవాడు. దీంతో ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. తనకు ఇష్టమైన మిఠాయిలను పూర్తిగా వదిలేశాడు. రైస్, గోధుమ పిండిని 90 శాతం వరకు తగ్గించాడు. కఠినమైన డైట్‌ను ఫాలో అవడం మొదలుపెట్టాడు. హై క్రాబ్ ఫుడ్‌తో పాటు జోవర్, బజ్రా, రాగి రొట్టెలు తినడం, దానికి తోడు పనీల్ పప్పు, కూరగాయలను వాడటం మొదలుపెట్టాడు. కఠిన డైట్‌తో పాటు ప్రతి రోజూ రెండు దఫాలు వ్యాయామం చేశాడు. అంతకు ముందు వారానికి కేవలం 5 సార్లు మాత్రమే వ్యాయామం చేసే అలవాటున్న సూర్య.. లాక్‌డౌన్ టైమ్‌లో రోజుకు రెండు సార్లు చొప్పున వారానికి 14 సెషన్ల వ్యాయామం చేశాడు.
India vs England: వామికాకు రెండు నెలలు.. అనుష్కకు స్వీట్ కిస్! వైరల్ ఫొటో!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications