India vs England: వామికాకు రెండు నెలలు.. అనుష్కకు స్వీట్ కిస్! వైరల్ ఫొటో!

అహ్మదాబాద్: మూడు నెలలుగా సంప్రదాయ ఫార్మాట్‌లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా.. ఇక టీ20 ఫార్మాట్‌లో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివర్లో స్వదేశంలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై కసరత్తులు ప్రారంభించింది. యువ ఆటగాళ్లతో కూడిన జట్టు ఉరకలేస్తున్న ఉత్సాహంతో జోరుమీదుంటే.. టెస్టు సిరీస్ పరాజయానికి పొట్టి ఫార్మాట్‌లో బదులివ్వాలని ఇంగ్లండ్ తహతహలాడుతున్నది. అయితే తొలి టీ20 కోసం భారత ఆటగాళ్లు మైదానంలో శ్రమిస్తూనే.. కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అందమైన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. భార్య అనుష్క శర్మను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను షేర్ చేశాడు. అనుష్క సోఫాలో కూర్చుని ఉండగా.. విరాట్ తన బుగ్గలపై ముద్దు పెట్టాడు. ఈ ఫొటోకు క్యాప్షన్‌గా లవ్ సింబల్‌ను జోడించాడు. కూతురు వామికాకు రెండు నెలలు పూర్తయిన సంతోషంలో విరాట్ తన సతీమణిని సంతోషంలో కిస్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది.
బాలీవుడ్ నటి అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకుని.. ఐదారేళ్లు లవ్‌లో ఉన్నారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. అనుష్క డెలివరీ సమయంలో ఆమె చెంత ఉండేందుకు పెటర్నటీ లీవ్‌పై కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేశాడు. అనుష్క గత జనవరి 11న కుమార్తెకు జన్మనిచ్చారు. పాప పుట్టిన 21 రోజుల అనంతరం అనుష్క తన మొదటి ఫొటోను షేర్ చేసి చిన్నారి పేరును వెల్లడించారు.
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను మోతేరాలో భారత్ ఈ రోజు ప్రారంభించబోతోంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవనుంది. టెస్టు మ్యాచ్‌లతో పోలిస్తే.. పొట్టి ఫార్మాట్ కోసం బ్యాటింగ్ పిచ్ సిద్ధంగా ఉంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా ఇక్కడ జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేసిన జట్లే ఐదింట విజయం సాధించాయి. వాతావరణం పొడిగా ఉండనుంది. మ్యాచుకు వర్షం ముప్పు లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications