For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషభ్ పంత్.. ఆ చిన్న తేడాను తెలుసుకోవాలి: సునీల్ గవాస్కర్

India vs England: Sunil Gavaskar explains how Rishabh Pant can become a lot more consistent

న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ మరింత నిలకడగా రాణించాలన్నా.. భారీ స్కోర్లు చేయాలన్నా కేర్‌లెస్, కేర్ ఫ్రీ షాట్లకు మధ్య ఉన్న చిన్న తేడాను తెలుసుకోవాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో రిషభ్ పంత్(88 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 91) విధ్వసంకర బ్యాటింగ్‌తో చెలరేగిన విషయం తెలిసిందే. అయితే పంత్ మళ్లీ 9 పరుగుల దూరంలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ఇన్నింగ్స్ బ్రేక్‌లో మాట్లాడిన గవాస్కర్.. పంత్‌ ఇన్నింగ్స్‌ను కొనియాడాడు.

ఆ చిన్న తేడాను గ్రహించాలి..

ఆ చిన్న తేడాను గ్రహించాలి..

'రిషభ్ పంత్ ఎప్పుడూ దూకుడైన ఆటగాడే. అతని బ్యాటింగ్‌ను అందరూ చూడాలనుకుంటారు. ఎందుకంటే పంత్ తన ఆటను ఆస్వాదిస్తూ ఆడుతాడు. అయితే రిషభ్ పంత్ ప్రతీసారి నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వికెట్ పారేసుకుంటున్నాడు. అతను కేర్‌ఫ్రీ, కేర్‌లెస్ మధ్య ఉన్న చిన్న తేడాను గ్రహిస్తే మరింత నిలకడగా రాణిస్తాడు. జాక్‌ లిచ్ బౌలింగ్‌ను పంత్ ఎదుర్కొన్న తీరు అద్భుతం.

ఎందుకంటే అతను ముందుగా సెటిల్ అవ్వడానికి ఇష్టపడలేదు. భారీ భాగస్వామ్యాన్ని అందించాలనుకున్నాడు. కుడిచేతి బౌలర్లకు తానెంత ప్రమాదకరమో గుర్తించాడు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో లిచ్ బౌలింగ్‌‌లో విరుచుకుపడ్డాడు.'అని గవాస్కర్ ప్రశంసించాడు. ఇక పంత్ ధాటికి లిచ్ తొలి 6 ఓవర్లలో 59 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక డామ్ బెస్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌కు ప్రయత్నించిన పంత్.. లిచ్‌కే చిక్కి వెనుదిరిగాడు.

ఆశ్చర్యంగా ఉంది..

ఆశ్చర్యంగా ఉంది..

ఇక టీమిండియా బ్యాటింగ్ తడబాటుపై సునీల్ గవాస్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎలాంటి తడబాటు లేకుండా చాలా ఈజీగా బ్యాటింగ్ చేస్తే ఆతిథ్య ఆటగాళ్లు మాత్రం ఆపోసోపాలు పడటం విచిత్రంగా ఉందన్నాడు. 'భారత్ బ్యాటింగ్ ఇలా ఉంటుందని ఏ మాత్రం ఊహించలేదు. ఉదయం డామ్ బెస్, జాక్ లీచ్ చాలా సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేశారు. కానీ ఇంగ్లండ్ బౌలింగ్ బలం కొత్త బంతనే విషయం తెలుసు. భారత ఆటగాళ్లు బంతి పాతబడే వరకు క్రీజులో ఉంటే మంచి స్థితిలో ఉండేవారు. కానీ దురదృష్టవశాత్తు రోహిత్ అద్భుత బంతికి వెనుదిరిగాడు.

డామ్ బెస్ సూపర్..

డామ్ బెస్ సూపర్..

ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ అండర్సన్ సూపర్ క్యాచ్‌కు ఔటయ్యాడు. 38 ఏళ్ల వయసులో కూడా అతను అద్భుత డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు. డామ్ బెస్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. విరాట్ కోహ్లీని ఔట్ చేసిన విధానం అతను బ్యాట్స్‌మెన్ కోసం రచిస్తున్న వ్యూహాలకు నిదర్శనం. వాస్తవానికి విరాట్ బంతి టర్న్ అవుతుందని అంచనా వేసాడు. కానీ అక్కడా అలా జరగలేదు. పైగా కొంచెం బౌన్స్ అయింది. దాంతో దాన్ని అడ్డుకోవాలనే ఆలోచనతో డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ డిప్పింగ్ బాల్స్‌ను అడ్డుకోవం చాలా కష్టం.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

 కష్టాల్లో భారత్..

కష్టాల్లో భారత్..

బ్యాటింగ్‌లో సత్తా చాటి భారీ స్కోర్ చేసిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్‌లోనూ అదరగొట్టింది. డామ్ బెస్(4/55), జోఫ్రా ఆర్చర్( 2/52) సత్తాచాటడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన భారత్ తీవ్ర కష్టాల్లో పడింది. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్(88 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 91), నయావాల్ చతేశ్వర్ పుజారా(143 బంతుల్లో 11 ఫోర్లతో 73) ఆదుకోవడంతో ఆలౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. చివర్లో చెన్నై లోకల్స్ వాషింగ్టన్ సుందర్(68 బంతుల్లో 5 ఫోర్లతో 33 బ్యాటింగ్), రవిచంద్రన్ అశ్విన్(54 బంతుల్లో 8 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా ఎదురు నిలవడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కన్నా ఇంకా 321 పరుగుల వెనుకంజలో ఉంది.

Story first published: Sunday, February 7, 2021, 19:00 [IST]
Other articles published on Feb 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+