
కుల్దీప్ రావడం ఖాయం..
'కాస్త వైవిధ్యంగా బంతులు విసిరే కుల్దీప్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ ఆఫ్ స్పిన్నర్లు. అశ్విన్ గాల్లో నెమ్మదిగా బంతులు వేస్తే, సుందర్ వేగంగా విసురుతాడు. కాబట్టి నదీమ్/సుందర్ స్థానాల్లో కుల్దీప్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 85 నాటౌట్ పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన సుందర్‌ను తప్పించలేరు. అయితే ఎవరు జట్టులోకి వచ్చినా ఇంగ్లండ్‌ను తక్కువస్కోరుకే కట్టడి చేయడానికి ప్రయత్నించాలి'' అని గవాస్కర్ సూచించాడు.

ఎక్స్‌ట్రాలపై దృష్టి సారించాలి..
'తొలి టెస్టులో నదీమ్ కాస్త భయపడ్డాడు. అతని బౌలింగ్‌ను ఉద్దేశించి చెప్పట్లేదు. అతను వేసిన నో బాల్స్ గురించి మాట్లాడుతున్నా. స్పిన్‌లో ఆత్రుతతో బంతులు వేయాలనుకున్నప్పుడే క్రీజును దాటుతుంటారు. అశ్విన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎన్నో ఏళ్ల తర్వాత అతను నోబాల్స్ వేశాడు. టీమిండియా వీటిపై దృష్టిసారించాలి'' అని గావస్కర్ పేర్కొన్నాడు. భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో 20, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు నోబాల్స్ వేశారు. వీటిలో నదీమ్ 9 నోబాల్స్ వేశాడు.

ఘోర పరాజయం..
420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 58.1 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (104 బంతుల్లో 72; 9 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (83 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ లీచ్‌కు 4 వికెట్లు దక్కగా, పేసర్ అండర్సన్ 3 కీలక వికెట్లు తీశాడు. చివరి రోజు తొలి సెషన్‌లో ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ ఇన్నింగ్స్ టీ విరామానికి ముందే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 'డబుల్ సెంచరీ' చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. కాగా, చెన్నై వేదికగా శనివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications
