For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆస్ట్రేలియాపై గెలవాలని కోరుకున్నాం.. ఇప్పుడు టీమిండియాను శత్రువులుగా భావించాల్సి వస్తుంది'

India vs England: Stuart Broad said We have moved from being Team Indias admirers to their enemy

చెన్నై: గబ్బా టెస్టు జరుగుతున్న సమయంలో ఆస్ట్రేలియాపై భారత్ గెలవాలని తమ జట్టు కోరుకుందని ఇంగ్లండ్‌‌ సీనియర్ పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్ తెలిపాడు. అయితే ఇప్పుడు భారత్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో కోహ్లీసేనను శత్రువుగా భావించాల్సి వస్తుందన్నాడు. టీమిండియాను మాత్రం అలా ఊహించుకోలేమని బ్రాడ్ పేర్కొన్నాడు. గాయాలతో ప్రధాన ఆటగాళ్లు దూరమైనా ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుత విజయం సాధించిందని కొనియాడాడు. ఫిబ్రవరి 5 నుంచి భారత్‌-ఇంగ్లండ్‌‌ మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్టు ఆరంభంకానుంది.

భారత్ పర్యటన అంత తేలిక కాదు:

భారత్ పర్యటన అంత తేలిక కాదు:

'భారత్ పర్యటన అంత తేలిక కాదు. గబ్బాలో ఆస్ట్రేలియాపై విజయంతో టీమిండియా రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే గబ్బా టెస్టులో భారత్‌కే మా జట్టు మద్దతు ఇచ్చింది. సమష్టి పోరాటం, సంకల్పం, గెలవాలనే స్ఫూర్తితో అద్భుత ప్రదర్శన చేసింది. గాయాలతో ఆటగాళ్లు దూరమైనా టీమిండియా చేసిన పోరాటాన్ని చూసి.. ప్రపంచంలో ఉన్న ఏ జట్టు అయినా ఎంతో గర్వపడుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో భారత్ ఉండటానికి కారణం ఇదే' అని డైలీ మెయిల్ కోసం రాసిన కాలమ్‌లో స్టువర్ట్ బ్రాడ్ ఇలా పేర్కొన్నాడు.

శత్రువులుగా భావించాల్సి వస్తుంది:

శత్రువులుగా భావించాల్సి వస్తుంది:

'రెండు వారాల క్రితం టీమిండియా ప్రదర్శనను అభిమానించిన మేం.. ఇప్పుడు కోహ్లీసేనను శత్రువులుగా భావించాల్సి వస్తుంది. అయితే అలా ఊహించలేం. నేను చూసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ఇది నేను మాత్రమే కాదు చాలామంది చెపుతారు. కోహ్లీ మైదానంలోకి దిగాడంటే.. పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. బౌలర్ ఎవరైనా, పిచ్ ఏదైనా రన్స్ చేస్తాడు. టీమిండియాలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ ఉన్నారు. అయితే వాళ్ల సానుకూలతల గురించి ఆలోచిస్తే.. పోరాడక ముందే మేం ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది. మా బలాలతో మేం బరిలోకి దిగుతాం' అని బ్రాడ్ పేర్కొన్నాడు.

పోరాడితే తప్పక గెలుస్తాం:

పోరాడితే తప్పక గెలుస్తాం:

'ఇంగ్లండ్‌ జట్టులో టాప్‌-10 ర్యాంకింగ్స్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నారు. అయితే టీమిండియా పటిష్ఠంగా ఉంది. చారిత్రక విజయాలు సాధించింది. కానీ మేం సానుకూల ధోరణితో పోరాడితే తప్పక గెలుస్తాం' అని ఇంగ్లండ్‌‌ సీనియర్ పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్ ధీమా వ్యక్తం చేశాడు. సుదీర్ఘ పర్యటనలో భారత్‌-ఇంగ్లండ్ జట్లు వరుసగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్టు ఆరంభంకానుంది. 13 నుంచి 17 వరకు చెన్నై వేదికగానే రెండో టెస్ట్ జరగనుంది. ఇక మొతేరా స్టేడియంలో చివరి రెండు టెస్టులు జరగనున్నాయి. ఆపై ఐదు టీ20లు ఇక్కడే జరుగుతాయి. పూణేలో వన్డేలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లు చెన్నై లీలా ప్యాలెస్ హోటల్లో క్వారంటైన్‌లో ఉన్నారు.

సిద్ధార్థ్‌ విజృంభణ.. తమిళనాడుదే ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ! రెండుసార్లు అతడి కెప్టెన్సీలోనే టైటిల్!

Story first published: Monday, February 1, 2021, 10:14 [IST]
Other articles published on Feb 1, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+