
నో చేంజ్..
'టీమిండియాలో ఆడేటప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. నా బ్యాటింగ్ శైలిలోనూ ఏ మార్పులు చేసుకోలేదు. ఏ స్థానంలో ఆడుతున్నామనే విషయం కేవలం ఆలోచనా విధానం మాత్రమే. జట్టుకు ఏది అవసరమో అదే చేయాలని ఆలోచించాలి. నేనైతే అలాగే ఆడతాను. పరిస్థితులను బట్టి బ్యాటింగ్ చేస్తా. ఈరోజు పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నవి. స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక మా బ్యాటింగ్ తీరులో ఎలాంటి మార్పులూ చేసుకోము. ఎందుకంటే మాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. పవర్ హిట్టర్లు తగినంత మంది ఉన్నారు' అని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.

సరైన నిర్ణయమే..
ఇక ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవడంపై స్పందించిన శ్రేయస్.. టీమ్‌ఇండియా నిర్ణయం సరైందేనని చెప్పాడు. 'మ్యాచ్‌కు ముందు ఆ వికెట్‌పై ప్రాక్టీస్ చేశాం. స్పిన్నర్లు బౌలింగ్ చేసినప్పుడు బంతి బాగా తిరిగింది. స్పిన్ బౌలింగే టీమిండియా బలం. కాబట్టి కచ్చితంగా వీలైనంత ఎక్కువ స్పిన్నర్లను ఆడించాలనుకున్నాం. మా పద్ధతిలో ఎలాంటి మార్పులూ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రణాళిక ప్రకారమే మేం సన్నద్ధమయ్యాం. వాటిని ఆచరణలో పెట్టాల్సి ఉంది'అని శ్రేయస్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో వీలైనన్ని ప్రయోగాలు చేసి సరైన జట్టును ఎంపిక చేయాల్సిన అవసరం టీమ్‌మేనేజ్‌మెంట్‌పై ఉందన్నాడు.

ఎవడి మాట వినకు..
దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్‌కు చేర్చిన ముంబై కెప్టెన్ పృథ్వీషాకు ఏమైనా చెప్తారా? అని ప్రశ్నించగా.. 'ముంబై ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అలాగే పృథ్వీ షా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతని మైండ్ సెట్ కూడా దూకుడుగానే ఉంది. ఇప్పటికే అతనితో మాట్లాడను. ఎవడి మాట వినకు.. నీ ఆట నీవు ఆడుకో అని చెప్పా.'అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.

అయ్యర్ 50
ఇక ఫస్ట్ టీ20లో టాపార్డర్ విఫలమైన వేళ క్రీజులోకి వచ్చిన అయ్యర్.. నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. పాండ్యాతో కలిసి శ్రేయస్ అయ్యర్(48 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 67) దాటిగా ఆడే ప్రయత్నం చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 124/7 స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. అయ్యర్ హాఫ్ సెంచరీ లేకుంటే భారత్ ఆ మాత్రం పరుగులు చేసేది కాదు. అనంతరం ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్ జాసన్ రాయ్ రాణించాడు.


Click it and Unblock the Notifications
