
మరో 94 పరుగులు చేస్తే:
వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 6వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్‌ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా అగ్రస్థానంలో ఉన్నాడు. ఆమ్లా 123 ఇన్నింగ్స్‌లలో 6వేల పరుగులను పూర్తిచేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (136 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ (139 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉన్నారు. గబ్బర్ ప్రస్తుతం 137 ఇన్నింగ్స్‌ల్లో 5906 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. శుక్రవారం జరిగే రెండో వన్డేలో మరో 94 పరుగులు చేస్తే.. విలియమ్సన్‌ను వెనక్కునెట్టి మూడో స్థానానికి చేరుకుంటాడు.

వన్డేల్లో 6000 పరుగులు?:
శిఖర్ ధావన్‌ను మరో రికార్డు సైతం ఊరిస్తుంది. వన్డేల్లో 6000 పరుగులు మార్కును చేరుకుంటే.. ఆ ఘనత సాధించిన 10వ భారత క్రికెటర్‌గా గబ్బర్ రికార్డు సాధించనున్నాడు. మొహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండ్యూలర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు వన్డేల్లో 6000 పరుగులు పూర్తిచేశారు. ఈ జాబితాలో ధావన్ కూడా చేరనున్నాడు.

ధావన్5000:
తాజాగా ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన ఐదవ భారత లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్‌గా శిఖర్ ధావన్ రికార్డుల్లోకి ఎక్కాడు. తొలి వన్డే ద్వారా ఆసియాలో గబ్బర్ 5000 వేల పరుగులు పూర్తిచేశాడు. ఈ జాబితాలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (10589), మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (7954), ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ (7327), మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా (5027) గబ్బర్ కంటే ముందున్నారు.

తృటిలో సెంచరీ మిస్:
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ తృటిలో సెంచరీ (106 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చేజార్చుకున్నాడు. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శుక్రవారం పూణే వేదికగా జరుగనుంది.
India vs England: నా టీ20 ప్రపంచకప్ జట్టులో వారిద్దరికి కచ్చితంగా చోటుంటుంది: వీవీఎస్ లక్ష్మణ్


Click it and Unblock the Notifications
