India vs England: ప్చ్.. త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్న ధావన్!! భారత్ స్కోర్ 250/5!

పూణే: ఇంగ్లండ్‌తో పుణె వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్‌లో 18వ శతకాన్ని నమోదు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 95 పరుగులు చేసినప్పటి నుంచి పరుగులు చేయడానికి కష్టపడిన గబ్బర్.. మరో మూడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. 98 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెన్ స్టోక్స్ వేసిన షార్ట్ పిచ్ స్లో బంతిని పుల్ షాట్ ఆడబోయి షార్ట్ మిడ్ వికెట్‌లో ఇయాన్ మోర్గాన్‌కు క్యాచ్‌గా చిక్కాడు.

సెంచరీ మిస్:
మ్యాచ్ ఆరంభంలో ఆచితూచి ఆడిన శిఖర్ ధావన్.. ఆతరువాత గేర్ మార్చి చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. ఏ దశలోనూ ఇబ్బంది పడని గబ్బర్.. బౌండరీలు బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో సిక్సర్ బాది 68 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. 90 పరుగుల వరకూ వేగంగా బ్యాటింగ్ చేసిన ధావన్.. సెంచరీకి చేరువలో ఒత్తిడిలోనయ్యాడు. 100 మార్క్ చేరే క్రమంలో నిదానంగా ఆడి వికెట్ చేజార్చుకున్నాడు. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు చేశాడు.

హార్దిక్ ఔట్:
విరాట్ కోహ్లీతో కలిసి వందకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన శిఖర్ ధావన్.. రోహిత్ శర్మతో తొలి వికెట్‌కు 64 రన్స్ జోడించాడు. ధావన్ పెవిలియన్ చేరిన కాపేపటికే భారత్ మరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా (1) తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. బెన్ స్టోక్స్ వేసిన 41వ ఓవర్ మూడో బంతికి స్లిప్‌లో బెయిర్‌స్టో చేతికి చిక్కాడు. దీంతో భారత్ 205 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. హార్దిక్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి కూడా అసౌకర్యంగానే కనిపించాడు. బంతిని ఆడడంలో విఫలమయి చివరకు వికెట్ పారేసుకున్నాడు.

వేగంగా ఆడుతున్న కృనాల్:
అనంతరం క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా వేగంగా పరుగులు చేస్తున్నాడు. కృనాల్ వరుస బౌండరీలతో హోరెత్తిస్తున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా వేగంగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. భారత్ 45 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. కృనాల్ (25), రాహుల్ (31) క్రీజులో ఉన్నారు. రోహిత్ (42 బంతుల్లో 28; 4 ఫోర్లు), కోహ్లీ (60 బంతుల్లో 56; 6 ఫోర్లు), శ్రేయస్ (9 బంతుల్లో 6; ఫోర్) పరుగులు చేశారు.

అరుదైన ఘనత:
తొలి వన్డేలో టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఆసియాలో అత్యధిక పరుగులు చేసిన ఐదవ భారత లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్‌గా ధావన్ రికార్డుల్లోకి ఎక్కాడు. తొలి వన్డే ద్వారా ఆసియాలో గబ్బర్ 5000 వేల పరుగులు పూర్తిచేశాడు. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ (10589), యువరాజ్ సింగ్ (7954), గౌతమ్ గంభీర్ (7327), సురేష్ రైనా (5027) గబ్బర్ కంటే ముందున్నారు.
Women's T20I Rankings: టాప్ లేపిన షఫాలీ వర్మ.. ఇది రెండోసారి!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications